Gautham Vasudev Menon: ఏ మాయ చేశావె2 సినిమాలో చైసామ్ కలిసి నటిస్తారా?

గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కి థియేటర్లలో విడుదలైన ఏ మాయ చేశావె సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చైతన్య, సమంత పాత్రలకు ప్రశంసలు దక్కాయి. ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గౌతమ్ వాసుదేవ మీనన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. . గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచం, సినీ ఇండస్ట్రీ చిన్నవైపోయాయని తెలిపారు.

ప్రస్తుతం ఇతర భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారని గౌతమ్ మీనన్ కామెంట్లు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాకు భాష లేదని లైఫ్ ఆఫ్ ముత్తు చిత్రంలో కొన్ని పాత్రలు హిందీలో మాట్లాడతాయని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. సినిమాలోని హిందీ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుందని గౌతమ్ మీనన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

పల్లెటూరులో జీవించే ముత్తు అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడని ఆ తర్వాత ఆ చీకటి ప్రపంచం నుంచి ఎలా బయటపడ్డాడనేదే ఈ సినిమా కథ అని గౌతమ్ వాసుదేవ మీనన్ అన్నారు. కథ డిమాండ్ చేయడం వల్ల ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నానని గౌతమ్ వాసుదేవ మీనన్ పేర్కొన్నారు. రెహమాన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. స్రవంతి రవికిషోర్ గారు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

2023 సమ్మర్ తర్వాత రామ్ తో నేను చేసే సినిమా ఉండవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. నాగచైతన్యతో ఏ మాయ చేశావె2, వెంకటేశ్ తో ఘర్షణ2, కమల్ హాసన్ తో రాఘవన్2 చేయాలని ఉందని గౌతమ్ మీనన్ తెలిపారు. అయితే ఏ మాయ చేశావె2 దిశగా గౌతమ్ మీనన్ అడుగులు వేసినా చైతన్య, సమంత ఈ సినిమాలో కలిసి నటిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus