బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ మరోసారి హైలెట్ అయ్యాడు. గౌతమ్ పల్లవిని నామినేట్ చేసినందుకు రివేంజ్ నామినేషన్ గా మళ్లీ గౌతమ్ నే నామినేట్ చేశాడు. తను నామినేట్ చేసిన పాయింట్ కి వివరణ ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరి మద్యలో మాటకి మాట పెరిగింది. సంచాలక్ గా నీ నిర్ణయం తప్పు అనిపించింది. అందుకే నామినేట్ చేస్తున్నా అని గౌతమ్ పల్లవి ప్రశాంత్ ని గుక్కతిప్పుకోకుండా మాటలు విసురుతూనే ఉన్నాడు. అలాగే, పల్లవి ప్రశాంత్ కూడా తిరిగి నామినేట్ చేస్తూ గౌతమ్ తో ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు.
ఇదే నామినేషన్ లో హైలెట్ అయ్యింది. బ్రిక్స్ టాస్క్ లో టవర్ ని కూల్చేయడంలో నీ పాత్ర ఎక్కువుందని, అందుకే నేను కెప్టెన్సీ రేస్ లో నుంచీ తప్పుకున్నానని ప్రశాంత్ చెప్పాడు. నువ్వు సేఫ్ గేమర్ అని అన్నాడు. దీంతో రెచ్చిపోయిన గౌతమ్ నువ్వే రివేంజ్ నామినేషన్స్ వేస్తావ్ ? అది మాకు తెలిసిందే., 12వ వారంలో ఉన్నామ్, సేఫ్ గేమ్ నడవదు అంటూ గౌతమ్ అరిచి మరీ సమాధానం చెప్పాడు. తప్పులుంటే నీకు వేరేవాళ్లు కనిపించరు. నాకు మాత్రమే వేస్తావ్ అంటూ గౌతమ్ ఆర్గ్యూమెంట్ పెంచాడు. దీంతో ఇది కాసేపు పక్కదోవ పట్టింది.
నా పంచ ఆనవాయితీ లెక్క నువ్వు కూడా నామినేషన్ వేస్తావ్ అని గౌతమ్ అన్నాడు. దీనికి కౌంటర్ గా ఆ పంచె ఊసిపోకుండా చూస్కో అన్నాడు ప్రశాంత్. దీంతో గౌతమ్ రెచ్చిపోయాడు. ఎక్కువ – తక్కువ మాట్లాడకు పంచె గురించి ఇది తెలుగు వాడి సంస్కృతి అంటూ గౌతమ్ వాదన పెట్టుకున్నాడు. దీనికి ప్రశాంత్ నేను కూడా పంచెతోనే ఎంట్రీ ఇచ్చాను, పంచె అంటే నాకు గౌరవం దాని గురించి కాదు మాట్లాడింది. నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావ్ అంటూ మాట్లాడాడు. అంతేకాదు, ఏమైనా అయితే రెండు గోలీలేస్కో తగ్గుతుందని వెటకారం చేశాడు పల్లవి ప్రశాంత్.
నిజానికి నామినేషన్స్ అప్పుడు మాటకి మాట చెప్పడంలో ప్రశాంత్ దిట్ట. ఏదైనా మాట అంటే దాన్ని అక్కడిక్కడే కౌంటర్ ఇచ్చేస్తాడు. ఇది ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచీ తనకి అలవాటే. అంతేకాదు, మాటకి మాట చెప్తూనే ఇది ఎంత దూరం అయినా సరే వెళ్లిపోతాడు. రెచ్చగొడుతూ ఉంటాడు. దీంతో హౌస్ మేట్స్ నోరుజారుతుంటారు. గోలీలేస్కో అన్నదానికి డాక్టర్ ప్రొఫెషన్ ని నేను ఏమీ అనలేదన్నా అంటూ మళ్లీ ప్రశాంత్ కవర్ చేసుకున్నాడు. నువ్వు తప్పుగా అర్దం చేస్కున్నావ్ అంటూ దబాయించాడు.
దీనికి గౌతమ్ నేను నిన్ను రైతు గట్ల అనలేదు కదా అంటూ గౌతమ్ మాట్లాడాడు. నామినేషన్ వేస్కుంటే వేస్కో నీకు అలవాటే కదా అంతేకానీ, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడకంటూ గౌతమ్ క్లాస్ పీకాడు. ఇలా ఇద్దరికీ నామినేషన్స్ లో ఆర్గ్యూమెంట్ పీక్స్ కి వెళ్లింది. ఇదే ఈవారం హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత రతిక ఇంకా పల్లవి ప్రశాంత్ – యావర్ ఇంకా అమర్ వాదనలు కూడ హైలెట్ అయ్యాయి. శివాజీ – ప్రియాంక ఇద్దరి మద్యలో కూడా ఆర్గ్యూమెంట్స్ ఒక రేంజ్ లో జరిగాయి. మరి ఈసారి ఎవరు (Bigg Boss 7 Telugu) ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.