Geetanjali 2: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ కథ ఇదేనా? ఎలా ఉండబోతోంది అంటే?

గ్రిప్పింగ్‌గా తీస్తే ఎవరు చేసినా హారర్‌, థ్రిల్లర్‌ సినిమాలు చూసేస్తుంటారు మన ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్‌లో ఈ జోనర్‌ కథలకు హిట్‌ పర్సంటేజీ ఎక్కువ. గతంలో ఇలా విజయం సాధించిన సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలోనే సీక్వెల్‌ చేసి ఉంటే ఇప్పుడు దాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అంజలి ‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది. ఈసారి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

శరవేంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమా తొలి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుండే ప్రారంభమవుతుందట. ఇందులో కూడా అంజలినే ‘హీరో’యిన్‌గా నటిస్తుందని ఇప్పటికే చెప్పేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చిన గీతాంజలి… ఈ సారి ఏం చేసింది. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంది అనేది కథ. అయితే తొలి భాగంలో విలన్‌ను భరతం పట్టేశారు. ఇప్పుడు కొత్త విలన్‌ రావొచ్చని టాక్‌.

సినిమా అంతా హైదరాబాద్‌, ఊటీ నేపథ్యంలోనే ఉంటుందట. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేశారట. ఊటీలో త్వరలో షూటింగ్‌ ఉంటుందట, దాంతో సినిమా షూటింగ్ పూర్తయిపోతుందట. సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలోనే తీసుకొస్తారట. అంతే జనవరి ఆఖరులో కానీ, ఫిబ్రవరి మొదట్లో కానీ ఉండొచ్చు. అయితే ఈ సినిమా సౌత్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో విడుదల చేస్తాం అని టీమ్‌ చెబుతోంది. అంటే రెండో (Geetanjali 2) ‘గీతాంజలి’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా చూడొచ్చు అన్నమాట.

తొలి భాగంలో అంజలితోపాటు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్‌, షకలకశంకర్‌, సప్తగిరి తమ కామెడీతో అలరించారు. ఈసారి అందులో ప్రధాన నటులతోపాటు అలీ, సునీల్‌, సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రవిశంకర్‌, ప్రియ, తదితరులు కూడా ఉంటారట. శివ తుర్లపాటి దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఎం.వి.వి.సత్యనారాయణ, జీవీ నిర్మాతలు కాగా, కోన వెంకట్‌ కథని అందించారు. అలాగే నిర్మాణంలో భాగస్వామి కూడా.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus