అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్‌దేవరకొండ హీరోగా GA2 PICTURES బ్యానర్ లో చేస్తున్న చిత్రం గీతగొవిందం. ఈ చిత్రానికి సంబందించి మెదటి సింగిల్ ని ఇప్పుడు తాజాగా “ఇంకేం ఇంకేం కావాలి” అనే మెలోడియస్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గోపి సుందర్ అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ అందించారు. సిడ్ శ్రీరామ్ ఈ అద్భుతమైన పాటను ఆలపించారు. అనంత శ్రీరామ్ అందమైన పదాలతో ఈ పాటను రచించారు. ఈ చిత్రం లో ఛలో హీరోయిన్ రష్మిక మందాన్న గీత పాత్రలో నటిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో విజయం సాధించిన పరుశురాం(బుజ్జి) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో… శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
చిత్ర సమర్పకులు శ్రీఅల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం లో మెదటి సాంగ్ ని విడుదల చేశాము. మంచి మెలోడి గా ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరుశురాం మంచి టేస్ట్ వున్న దర్శకుడు. హీరోయిన్ రష్మిక పాత్ర పేరు గీత.. ఈ చిత్రం తరువాత తనని గీత అని పిలుస్తారు అంతబాగా నటించింది. గోపిసుందర్ సంగీతం బాగుంది. చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ విడుదల చేశాం. అగష్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ.. మా గీతగోవిందం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. గీతగోవిందం చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు అగష్టు 15న తీసుకువస్తున్నాం. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బన్ని వాసు సపోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవర కొండ గోవిందం గా అందర్ని అలరిస్తాడు. రష్మిక తన పాత్ర లో పరకాయప్రవేశం చేసింది. చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ విడుదల చేశాం. మంచి మెలోడీ సాంగ్. గోపి సుందర్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. అన్ని పాటలు అనిముత్యాల్లా ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అగష్టు 15 న మీ ముందుకు వస్తాం. అని అన్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.. శ్రీ అల్లు అరవింద్ గారు చిత్ర సమర్పకులు గా నేను నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం గీతగోవిందం. ఈ చిత్రం లో మా గోవిందం అలియాస్ విజయ్ దేవరకొండ సూపర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మరోక్కసారి ప్రేక్షకుల ముఖచిత్రాన్ని తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం మాకుంది. పరుశురాం కి ఫ్యామిలీ ఎమోషన్స్ ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విధ్య. గోపిసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. ఇప్పుడు విడుదల చేసిన ఇంకేం ఇంకేం కావాలే అనే సాంగ్ చాలు… పాటలకు ఎంత ప్రాధాన్యం వుందో. గీత గోవిందం చేసే అల్లరి యూత్ ని ఆకట్టుకుంటాయి. అగష్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం.. అని అన్నారు.