2014 లో అంజలి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi) అనే మూవీ రూపొందింది. శివ తుర్లపాటి దర్శతక్వంలో ‘ఎం.వి.వి సినిమాస్’తో కలిసి ‘కోన ఫిల్మ్స్ కార్పొరేషన్’ పై కోన వెంకట్ (Kona Venkat) ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి కెరీర్లో ఇది 50వ సినిమా.దీంతో ప్రమోషన్స్ వంటివి బాగానే చేశారు.
ఇక నిన్న అంటే ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో సో సో ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.16 cr |
సీడెడ్ | 0.08 cr |
ఆంధ్ర(టోటల్) | 0.12 cr |
ఏపీ + తెలంగాణ | 0.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.03 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.39 cr |
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టుకోవాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.0.39 కోట్లు షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు. చూడాలి మరి..