‘టాక్సిక్’ సినిమా గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి నోట నుండి వినిపిస్తున్న వాక్యాల్లో కామన్‌గా వినిపించిన మాట ‘ఒక లేడీ డైరక్టర్ నుండి ఇలాంటి సీనా?’. అవును అలా అందరూ అనేలా ఉంది మరీ ఆ ఇంటిమేట్ సీన్. అలాంటి సిన్స్ తీయడంలో దిట్ట అయిన మాజీలు, ఆసక్తి ఉన్న వాళ్లు ‘అదరగొట్టావ్ గీతూ’ అని మెచ్చుకుంటూ ఉంటే.. ఆ సీన్ చూశాక ‘ఇలాంటి సీన్ ఒక లేడీ తీయడమా’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సీన్ డైరెక్ట్ చేసిన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తొలిసారి రియాక్ట్ అయ్యారు.
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ‘కేజీయఫ్’ లాంటి భారీ హిట్ల తర్వాత యశ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల ఓ టీజర్ విడుదల చేశారు. అయితే ఓ ఇంటిమేట్ సీన్ ఉండడంతో విమర్శలు వస్తున్నాయి. ఆ సీన్ హీరోయిన్‌తో కాకపోవడం గమనార్హం. పాత్ర నైజం చెప్పే ప్రయత్నంలో ఆ సీన్ పెట్టినట్లు ఉంది. ఈ విమర్శలపై గీతూ రియాక్ట్ అవుతూ ‘‘మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించింది అంటూ వస్తోన్న విమర్శలు చూసి చిల్ అవుతున్నాను’’ అని చెప్పింది.

ఇక ఆ సీన్‌లో నటించిన నటిని కూడా గీతూ పరిచయం చేశారు. ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని తెలిపారు. ఆ హాలీవుడ్ నటి ‘బ్రూక్లిన్ నైన్ నైన్’ టీవీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. డిస్నీ యానిమేటెడ్ సినిమా ‘ఎన్కాంటో’లోనూ బీట్రీజ్ నటించింది. ఇక ‘టాక్సిక్’ విషయానికొస్తే యశ్‌తో పాటు కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేస్తామని చెబుతున్నారు. అలాగే ఇది పాన్ వరల్డ్ సినిమా కూడా చెబుతున్నారు.
