Geethu royal: నా లైఫ్ లో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అదే.. గీతూ కామెంట్స్ వైరల్!

బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ సీజన్ లో గీతూ రాయల్ తన మాట తీరుతో అలాగే తన ఆట ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఈమె బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉంటారని అందరూ భావించినప్పటికీ ఊహించని విధంగా ఈమె 9వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇలా ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో గీతూ సైతం బోరున ఏడ్చేశారు.

ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధతో ఈమె ఏ ఇంటర్వ్యూలలో కూడా హాజరు కాలేదు అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే గీతూ బిగ్ బాస్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన ఈమె తాను రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని వెల్లడించారు. ఇకపోతే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు తాను బాధపడిన విషయాల గురించి కూడా తెలియజేశారు

తాను ఆరోజు బట్టలు కూడా సర్దుకోలేదని అంతలా తాను ఎలిమినేట్ కాననే నమ్మకం తనకు ఉండేదని తెలిపారు.ఇక ఎప్పుడైతే తన ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ తెలియజేశారో ఆ క్షణం ఎంతో బాధేసిందని తెలిపారు. నా లైఫ్ లో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది నా ఎలిమినేషన్ అంటూ ఈమె తెలిపారు. ఈ చిట్ చాట్ లో భాగంగా రేవంత్ గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. రేవంత్ హౌస్ లో ఉన్నప్పుడు మీతో పోట్లాడారు అయితే మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చారు.

అంటూ ప్రశ్నించగా ఈమె తన ఏడుపు గురించి మాట్లాడుతూ..రేవంత్ నా దగ్గర మంచిగా మాట్లాడి పక్కకు వెళ్లేటప్పుడు బ్యాడ్ గా మాట్లాడేవారు అయితే నేను ఎలిమినేట్ అయినప్పుడు అతని ఏడుపు మాత్రం రియల్ అంటూ ఈమె తెలిపారు. ఇక ఆదిరెడ్డి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు. టాప్ ఫైవ్ లో ఆదిరెడ్డి, రేవంత్, ఫైమా, శ్రీహాన్, ఇనయ లేదా రోహిత్ ఉండవచ్చని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల గురించి కూడా తెలిపారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus