Geethu: వైరల్ అవుతున్న గీతూ రాయల్ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకరైన గీతూ రాయల్ ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారనే సంగతి తెలిసిందే. తాజాగా గీతూ రాయల్ ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో గీతూ రాయల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తానని కలలో కూడా భావించలేదని అమ్మానాన్న చెప్పిన మాట వినకపోవడం వల్లే నేను బయటకు వచ్చానని ఆమె కామెంట్లు చేశారు. మరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండవద్దని లౌక్యం తెలియాలని కొంచెమైనా డిప్లమాటిక్ గా ఉండాలని అమ్మానాన్న చెప్పారని గీతూ రాయల్ పేర్కొన్నారు.

నాకు కోపం, ప్రేమ ఎక్కువని బిగ్ బాస్ హౌస్ కు వెళ్లే సమయంలో నాకు బంధాల గురించి పెద్దగా తెలియదని గీతూ రాయల్ అన్నారు. బాల్యం నుంచి నేను నమ్మిన వాళ్లు నాకు వెన్నుపోటు పొడిచారని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు. స్కూల్ లో కాలేజ్ లో నన్ను వెన్నుపోటు పొడిచారని బిగ్ బాస్ పై ఒట్టేసి చెబుతున్నానని తనకు పీఆర్ టీం లేదని ఆమె అన్నారు. నెగిటివ్ కామెంట్లు పెడితే పాజిటివ్ కామెంట్లు పెట్టమని ఒకరితో మాట్లాడుకుని 25,000 రూపాయలు ఇచ్చానని గీతూ రాయల్ అన్నారు.

కానీ వాళ్లు ఏం చేయకుండా మోసం చేశారని ఆమె కామెంట్లు చేశారు. నమ్మి సహాయం చేస్తారని అనుకున్న వాళ్లు నాకు సహాయం చేస్తారని అనుకున్నానని ఆమె వెల్లడించారు. వాళ్లను తలచుకుంటే నా వల్ల కావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది ఆట ఆడటానికి పనికిరారని బిగ్ బాస్ హౌస్ లో కామెంట్ చేశానని గీతూ రాయల్ పేర్కొన్నారు.

అయితే నేనే ఆట ఆడలేకపోయానని గీతూ రాయల్ పేర్కొన్నారు. అందుకే అందరూ ఇంట్లో ఉన్నారని నేను హౌస్ నుంచి బయటకు వచ్చేశానని ఆమె కామెంట్లు చేశారు. గీతూ రాయల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus