Geetu Royal: ఆ ప్రేమను చూపించడం సాధ్యం కాదంటున్న గీతూ రాయల్!

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న గీతూ రాయల్ తన చేష్టలతో కొంతమందికి చిరాకు తెప్పించిన సంగతి తెలిసిందే. గీతూ రాయల్ వల్లే బిగ్ బాస్ షో చూడటం లేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తాజాగా గీతూ రాయల్ బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వస్తే కచ్చితంగా పోనని ఆమె తెలిపారు.

తాను మళ్లీ అవకాశం ఇచ్చినా చచ్చినా పోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న గీతూ రాయల్ తాజాగా మాట్లాడుతూ నేను గేమర్ నని గేమ్ లో గెలిచే దిశగా నా ఆలోచనలు ఉంటాయని కామెంట్ చేశారు. బాలాదిత్య బలహీనతతో ఆడుకోవడం వల్లే నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు.

బాలాదిత్యను తాను ఎమోషనల్ గా ఇబ్బంది పెట్టడమే తాను చేసిన పొరపాటు అని ఆమె కామెంట్లు చేశారు. అయితే బాలాదిత్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని గీతూ రాయల్ అన్నారు. బిగ్ బాస్ పై ఉన్న ప్రేమను ఒక్కసారి చూపించడమే సాధ్యమవుతుందని ఆ ప్రేమను మళ్లీ మళ్లీ చూపించడం సాధ్యం కాదని ఆమె కామెంట్లు చేశారు. ఈ రీజన్ వల్లే బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చినా మళ్లీ వెళ్లే ఆలోచన అయితే లేదని గీతూ రాయల్ కామెంట్లు చేశారు.

గీతూ రాయల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతూ రాయల్ కు బిగ్ బాస్ షో ద్వారా భారీగానే రెమ్యునరేషన్ దక్కింది. బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో గీతూ రాయల్ కెరీర్ విషయంలో ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే తక్కువ కాదనే సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus