Geetu Royal, Revanth: నామినేషన్స్ లో రేవంత్ – గీతు బిగ్ ఫైట్..! ఇద్దరికీ ఎందుకు పడట్లేదంటే..?

బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్స్ లో పెద్ద రచ్చే జరిగింది. రేవంత్ ఇంకా గీతు ఒకరినొకరు నామినేట్ చేస్కుంటూ రెచ్చిపోయారు. బిగ్ బాస్ కుండ బద్దలు కొట్టి మరీ ఒకర్ని నామినేట్ చేయమని చెప్పాడు. కుండకి పార్టిసిపెంట్ ఫోటో అంటించి, బావిలో పారేసి బద్దలు కొడుతూ మరీ నామినేట్ చేయాలి. ఇక్కడే గీతు రేవంత్ బిహేవియర్ ని మరోసారి క్వశ్చన్ చేస్తూ నామినేట్ చేసింది. కామెడీ ఓవర్ అవుతోందని, పంచభక్షపరవాన్నాలు పెట్టాలని కడుపు నింపాలని అనుకుంటాడు. కానీ, వాటితో పాటుగా పెంట కూడ పెడతాడు అంటూ మాట్లాడింది.

కానీ బిగ్ బాస్ దాన్ని మ్యూట్ చేశాడు. అది చూసి ఆ పంచభక్ష పరవాన్నాలు కూడా తినబుద్ది కాదు అని రేవంత్ బిహేవియర్ ని ఏద్దేవా చేస్తూ మాట్లాడింది. ఆ తర్వాత రేవంత్ తన వంతు వచ్చినపుడు గీతుకి ఇచ్చిపారేశాడు. నేను నిన్ను నామినేట్ చేయడమే ఛీఛీ అనిపిస్తోందని, నేను మారలేదని నువ్వు చెప్పావ్ అని, నీ ముందు ప్రూవ్ చేస్కోవాల్సిన కర్మ నాకు పట్టలేదని చెప్పాడు రేవంత్ .అది నాకు కరెక్ట్ అనిపించలేదు. నీకు ఎథిక్స్ లేవేమో, నాకు ఉన్నాయ్ అన్నాడు. వెరీ గుడ్ అంటూ కౌంటర్ వేసింది గీతు.

ఇక్కడే బిగ్ ఫైట్ అయ్యింది. అది నువ్వు చెప్పక్కర్లేదు అనేసరికి, అయితే చెవిలో దూదిపెట్టుకో అంటూ ఎటాక్ కి దిగింది. ఎక్స్ ట్రాలు వద్దు అని రేవంత్ అంటే, నేను ఎక్స్ ట్రానే మాట్లాడతా అంది. దీంతో నాకు నీతు మాట్లాడమే అసహ్యం అంటూ రెచ్చిపోయాడు రేవంత్. నాకు లేదు అసహ్యం నాకు నువ్వంటే ఇష్టం అంటూ రీకౌంటర్స్ వేస్తునే ఉంది గీతు. ఇంత పరవాన్నం పెట్టి ఏదో అన్నావ్ కదా, అశుద్ధం మీద రాయి వేస్తే నా మీద పడతది. అలాంటి క్యారెక్టర్ నువ్వు అంటూ గీతుని రెచ్చగొట్టాడు.

దీంతో గీతు నేను జైల్ నుంచీ బయటకి రాగానే రాత్రి నిద్రలేను అనేసరికి నువ్వు ఆదిరెడ్డి పడుకోనివ్వలేదా అంటూ మాట్లాడావ్ అని, అప్పుడు నాకు బాగా మండిందని చెప్పింది. దీంతో ఆదిరెడ్డి ఇన్వాల్ అవుతూ రేవంత్ ఆ మాట అన్నావ్ కానీ, నీ ఉద్దేశ్యం అది కాదని చెప్పాడు. దీంతో రేవంత్ బిగ్ బాస్ ని ఆ వీడియో గురించి రిక్వస్ట్ చేశాడు. మొత్తానికి నామినేషన్స్ లో ఇద్దరికీ పెద్ద యుద్ధమే జరిగింది. మాటకి మాట పెంచుతూ చాలాసేపు నామినేషన్స్ ప్రక్రియలో ఆర్గ్యూమెంట్ చేశారు.

దీంతో మిగతా హౌస్ మేట్స్ లో కొందరికి కాళ్లు నొప్పి పుట్టి కూర్చుండిపోయారు. రేవంత్ కి ఇంకా గీతుకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతోంది. మొదటి నుంచీ కూడా ఇద్దరికీ అస్సలు పడట్లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్లుగానే ఇద్దరూ బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా వాష్ రూమ్ కడిగించిందన్న కోపంతో రేవంత్ ఉన్నాడు. అలాగే, గీతు కూడా రేవంత్ ని టార్గెట్ చేసి మరీ తన తప్పులని చెప్తోంది. మొత్తానికి ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగానే తగ్గేదేలే అంటున్నారు. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus