Geetu, Revanth: గీతు గేమ్ ఛేంజరా.. తొక్కా..! రెచ్చిపోయిన రేవంత్..! టాస్క్ లో జరిగింది ఇదే..?

బిగ్ బాస్ హౌస్ లే చేపల టాస్క్ లో అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక నల్ల చేపని గాల్లో నుంచీ పంపించి దానిద్వారా స్వాప్ చేస్కోవచ్చని చెప్పాడు. గేమ్ లో అవుట్ అయిన గీతు ఈ నల్లచేపని దక్కించుకుంది. ఛాన్స్ ఇస్తే ఆదిరెడ్డి, నేను స్వాప్ అవుతామని బిగ్ బాస్ ని అడిగింది. దీనికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు. అందుకే, గీతు రేవంత్ జంటని, శ్రీహాన్ జంటని స్వాప్ చేసింది.

ఇక్కడే చేపల టాస్క్ లో నెంబర్ 1 పొజీషన్ లో ఉన్న రేవంత్ ఒక్కసారిగా పొజీషన్ మారిపోయాడు. శ్రీహాన్, శ్రీసత్య ఇద్దరూ నెంబర్ 1కి వచ్చారు. ఇక్కడే రేవంత్ కి గీతుకి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. నల్లచేప ఉందని విర్రవీగిన గీతుకి సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు రేవంత్. నేను గేమ్ ఆడానో లేదో ఆడియన్స్ చూశారని, అందరికంటే ఎక్కువ చేపలని కాపాడుకుని , తీసుకుని గెలిచింది మేమే అని అందరికీ తెలుసని, గేమ్ ఆడటం చేతకాక గేమ్ ఛేంజరా బిల్డప్ ఇవ్వద్దని అన్నాడు.

దీంతో గీతు రేవంత్ కి కౌంటర్ వేసింది. ఇద్దరూ ఏం పీకలేవ్ అనే వరకూ వచ్చారు. ఇద్దరి మద్యలో మాటా మాటా పెరిగింది. నిజానికి గొడవ ఎక్కడ మొదలైందంటే., ఈవారం గీతుకి, రేవంత్ కి పెరుగు దగ్గర పెద్ద ఇష్యూ అయ్యింది. నువ్వు ఎక్కువ పెరుగు తింటున్నావ్ అని, ఫుడ్ దొంగవని ఆరోపణలు చేసింది గీతు. దీంతో రేవంత్ నువ్వు కూడా రాత్రిపూట లేచి ఫుడ్ తింటున్నావని చెప్పాడు.

ఆ తర్వాత చేపల టాస్క్ లో ఎలిమినేట్ అయిపోయిన గీతు పెరుగు తింటున్నప్పుడు ఇప్పుడు తనకి పెరుగు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. అంతేకాదు, తనని నీయబ్బా అని గేమ్ లో తిట్టిందని అది నాకు బాగా ట్రిగ్గర్ అయ్యిందని కూడా అభిప్రాయపడ్డాడు. ఈరెండు తన మనసులో ఉన్నాయి. అందుకే బ్లాక్ ఫిష్ తో స్వాప్ చేసిన గీతుకి ఫుల్ క్లాస్ పీకాడు. రేవంత్ కి రీకౌంటర్ వేస్తూ గీతు కూడా రెచ్చిపోయింది. నేను గేమ్ ఇలాగే ఆడతా ఇది నాఇష్టం అంటూ మాట్లాడింది.

గేమ్ ఆడటం చేతకాలేదు, అందుకే మొదటిరౌంట్ లోనే అవుట్ అయిపోయావ్ అంటూ రేవంత్ గీతుకి ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు, నీగేమ్ ఏంటో అందరికీ తెలుసులే అంటూ సెటైర్స్ కూడా వేశాడు. ఇక బ్లాక్ ఫిష్ తో స్వాప్ చేసిన తర్వాత రేవంత్ కొద్దిగా ఫ్రస్టేట్ అయిపోయాడు. ఖచ్చితంగా నామినేషన్స్ ఈపాయింట్స్ రేవంత్ డిస్కస్ చేస్తాడు. అలాగే వీకండ్ నాగార్జున గీతు ఇంకా రేవంత్ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus