జెనీలియా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. గతంలో ‘సై’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘రెడీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే 2012 లో వచ్చిన ‘నా ఇష్టం’ తర్వాత ఈమె టాలీవుడ్ కు దూరమైంది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కూడా దూరమైంది. మొత్తానికి ‘జూనియర్’ తో రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఈ సినిమా ప్రమోషన్స్ లో జెనీలియా తన భర్త గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. జెనీలియా మాట్లాడుతూ.. ” నేను రీ ఎంట్రీ ఇచ్చి 3 ఏళ్ళు అయ్యింది. నా భర్త హీరోగా, దర్శకుడిగా రూపొందించిన ‘మజిలీ’ మరాఠీ రీమేక్లో నేను సమంత చేసిన పాత్ర చేశాను. కానీ ‘జూనియర్’ తో సంపూర్ణంగా రీ ఎంట్రీ ఇచ్చినట్టు అనుకోవాలి. మనకి నచ్చిన పని చేయాలంటే కుటుంబ సహకారం కూడా చాలా ముఖ్యం.
ఇప్పుడు నా భర్త, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. పైగా నా భర్త రితేష్ దేశ్ ముఖ్ అయితే 3 ఏళ్ళ నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వమని టార్చర్ చేస్తున్నాడు. అందుకే నేను మంచి పాత్రల కోసం ఎదురు చూశాను. ఫైనల్ గా ‘జూనియర్’ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. వెంటనే ఓకే చేశాను. తెలుగు ప్రేక్షకులు నన్ను హాసినిగా ఓన్ చేసుకున్నారు.
నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను అంటే ఛాన్సులు రావు. మన టాలెంట్ కి తగ్గ పాత్రలు మాత్రమే వస్తాయి అని నేను నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి జెనీలియా రీఎంట్రీ ఇవ్వడం వెనుక భర్త రితేష్ దేశ్ ముఖ్ సహకారం అని స్పష్టమవుతుంది.