Gentleman: నానికి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో ‘జెంటిల్ మేన్ 2’..!

నాని, ‘జెంటిల్ మేన్’ అనగానే.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ అనుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ ఆ సినిమా గురించి కాదు ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది. 1993 వ సంవత్సరంలో యాక్షన్ కింగ్ అర్జున్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆల్ టైం హిట్ ‘జెంటిల్ మేన్ ‘ గురించి. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

కానీ అక్కడ ఈ మూవీ సక్సెస్ కాలేదు అనుకోండి.. అది వేరే సంగతి. ఈ చిత్రాన్ని కె.టి. కుంజుమోన్ నిర్మించారు. ఈయన భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి వెనకడుగు వేసేవారు కాదు. ‘జెంటిల్ మెన్’ ‘ప్రేమదేశం’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన నాగార్జున తో ‘రక్షకుడు’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. కానీ అది అంతగా ఆడలేదు. ఇదిలా ఉండగా.. ‘జెంటిల్ మెన్’ కు సీక్వెల్ గా ‘జెంటిల్ మేన్ 2’ నిర్మిస్తాను అని కుంజుమోన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే ‘జెంటిల్ మేన్’ దర్శకుడు శంకర్ మాత్రం వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అసలు ‘జెంటిల్ మేన్ 2’ పై ఆయనకు ఆసక్తి కూడా లేదు. కానీ కుంజుమోన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా.. ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ తీసే వరకు నిద్రపోయేది లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టుని సెట్ చేశారు. కాకపోతే డైరెక్టర్ విషయంలో మాత్రం ఆయన కంగారు పడ్డారు అనే కామెంట్లు ఇప్పుడు ఎక్కువయ్యాయి.

‘జెంటిల్ మేన్ 2’ ని తెరకెక్కించబోయే దర్శకుడు మరెవరో కాదు గోకుల్ కృష్ణ. ఈయన గతంలో నానితో ‘బ్యాండ్ బాజా బారత్’ రీమేక్ గా ‘ఆహా కళ్యాణం’ ని తెరకెక్కించాడు. అది ప్లాప్ కావడంతో ఈయనకి మరో అవకాశం దక్కలేదు. ఇలాంటి దర్శకుడికి ‘జెంటిల్మెన్ 2’ తెరకెక్కించే అవకాశం కల్పిస్తున్నారు కుంజుమోన్. దీంతో ‘కుంజుమోన్ కు డబ్బులు ఎక్కువైపోయాయి, డైరెక్టర్ సెలక్షనే… ఇలా ఉంటే ఇక నటీనటుల సెలక్షన్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus