సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ వ్యవస్థపై మంది పడ్డారు. ఆయన రాజకీయా రంగ ప్రవేశ ప్రకటన గురించి మూడు రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ రోజు చల్లని కబురు అందింది. శుక్రవారం చెన్నైలోని కొడాంబక్కంలో తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా రజినీకాంత్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. “రాజకీయాల్లో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ, వ్యవస్థ చెత్తగా మారినప్పుడు మనమేం చేస్తున్నాం. ప్రజాస్వామ్యం భ్రష్టుపడిపోయింది. వ్యవస్ధ మారాలి. ప్రజల ఆలోచనల్లోంచి మార్పు రావాలి. అప్పుడే దేశం సరైన మార్గంలో ముందు కెళుతోంది’ అని అన్నారు.
“రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు నా గొంతు వినిపిస్తాను” అని చెప్పారు. ‘ మీతోపాటే నాక్కూడా బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇప్పుడవి చేద్దాం. కానీ, తప్పనిసరి పోరాటం వచ్చినప్పుడు మనందరం చూస్తాం. సరైన సమయంం వచ్చినప్పుడు అభిమానం చూపించడానికి సిద్ధంగా ఉండాలి” అని అభిమానులకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి లేటైనా లేటెస్ట్ గా వస్తానని రజనీ తన స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.