ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒక రేంజ్ లో చేసింది చిత్రయూనిట్. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చి సినిమాపై భారీ అంచనాలని పెంచేశారు. ఫస్ట్ నుంచీ కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ గా ఈ సినిమా ముందుకు వచ్చింది. నీ కన్ను నీలి సముద్రం సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై అందరి దృష్టి పడింది. ఫిబ్రవరి 12వ తేదిన ప్రేమికుల రోజుకి రెండురోజుల ముందే ఈసినిమా రాబోతుండటం అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తోంది.
అయితే, అంతలా ఈ సినిమాలో ఏముంది సేమ్ ఇలాంటి లవ్ స్టోరీలు చాలా చూశాం కదా అని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు, ఈసినిమాని 1981లో వచ్చిన సీతాకోక చిలుక సినిమాతో పోలుస్తున్నారు నెటిజన్స్. మురళి అలియాస్ కార్తీక్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. డైరెక్టర్ భారతీరాజా తీసిన ఈ సినిమా తెలుగు తమిళం రెండు భాషల్లో కూడా సూపర్ డుపర్ హిట్ అయ్యింది.
ఇద్దరి ప్రేమికులకి అడ్డుగా నిలిచిన పెద్దరికంపై వచ్చిన సినిమా అది. కార్తీక్ హీరోగా, ముత్యళ్ల అరుణ హీరోయిన్ గా వెండితెరకి పరిచయం అయ్యారు. అది కూడా ఇళయరాజాగారి మ్యూజికల్ హిట్టే. ఇప్పుడు కూడ ఉప్పెన సినిమా స్టోరీలైన్ అలాగే ఉండటంతో ఈ సినిమాతో పోలుస్తున్నారు అందరూ. మరి సేమ్ టు సేమ్ అదే స్టోరీ లైన్ ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే.