వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో ‘రెనైజెన్స్ పిక్చర్స్’ ‘అల్లు బాబీ కంపెనీ’ బ్యానర్లపై సిద్దు ముద్ద, అల్లు బాబీ లు కలిసి వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.వరుణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి 6ప్యాక్ బాడీని డెవలప్ చేసాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది.
తమన్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
8.10 cr
సీడెడ్
3.60 cr
ఉత్తరాంధ్ర
2.40 cr
ఈస్ట్
1.70 cr
వెస్ట్
1.40 cr
గుంటూరు
1.80 cr
కృష్ణా
1.50 cr
నెల్లూరు
0.80 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
21.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.40 cr
ఓవర్సీస్
1.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
25.50 cr
‘గని’ చిత్రానికి రూ.25.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.27 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఉంది కాబట్టి.. దాని పోటీని తట్టుకుని నిలబడాలంటే కచ్చితంగా హిట్ టాక్ ను సంపాదించుకోవాలి. లేకుంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం. బుకింగ్స్ అయితే యావరేజ్ గానే ఉన్నాయి. టాక్ ను బట్టి ఆఫ్లైన్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు.
వరుణ్ తేజ్ సినిమాలకి రూ.25 కోట్ల షేర్ ను రాబట్టే సత్తా ఉంది. మరి ఈ మూవీ ఎంత వరకు రాబడుతుందో చూడాలి..! పాండమిక్ తర్వాత వరుణ్ తేజ్ నుండీ రాబోతున్న మూవీ ఇదే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.