ఏదైనా సినిమాకు వయసు రాదు, ఎప్పుడు చూసినా కొత్తగా, ఇప్పుడే తీశారా అనేలా ప్రపంచంలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిని ఏజ్ లెస్ ఎపిక్ అని అంటుంటారు. అలాంటి సినిమాల్లో ‘గ్లాడియేటర్’ ఒకటి. 2000 సంవత్సరంలో విడుదలై భారీ హిట్‌ని అందుకుంది. రిడ్లే స్కాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అదిరిపోయే విజువల్స్‌తో కలెక్షన్లతో అదరగొట్టింది. ఇప్పుడు ఎందుకీ ఈ సినిమా గురించి చర్చ అంటే.. దానికి సీక్వెల్ వస్తోంది కాబట్టి.
రసెల్ క్రో, జాక్విన్ ఫీనిక్స్, కోనీ నీల్సన్, రిచర్డ్ హారిస్ తదితరులు నటించిన ఈ సినిమాకు సీక్వల్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొనసాగింపు చిత్రం తీయబోతున్నారు. ఐదు ఆస్కార్ అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ అదే స్థాయిలో జోరు చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ‘మిషన్ ఇంపాజిబుల్ 2’ తర్వాత భారీ వసూళ్లతో దూసుకుపోయిన రెండో చిత్రం కూడా ఇదే.
‘గ్లాడియేటర్ 2’ సినిమాను కూడా రిడ్లే స్కాట్ తెరకెక్కిస్తున్నారు. పాల్ మెస్కెల్, పెడ్రో పాస్కల్, డెంజెల్ వాషింగ్టన్ తదితరులు ఇతర కీలకపాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఒక బాసిన రాజుపై ప్రతీకారం తీర్చుకున్న క్షణం.. క్రోధమే నీకు వరం, ప్రాణాలతో ఉండాలి ఆఖరి వరకూ..’ లాంటి డైలాగ్స్ అదిరిపోయాయి. మాక్సిమస్ వారసుడు లూసియాస్ చుట్టూ తిరిగే కథనంతో రూపొందిన ఈ చిత్రం నవంబరు 22న విడుదల కానుంది.
ఇక ‘గ్లాడియేటర్’ సినిమా కథ విషయానికొస్తే.. రాజ్య సింహాసనం కోసం కొమోడస్ తన తండ్రి రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్‌ను హత్య చేస్తాఉడ. అయితే రోమన్ జనరల్ మాక్సిమస్ డెసిమస్ మోసపోతాడు. దీంతో మాక్సిమస్ గ్లాడియేటర్‌గా మారుతాడు. ఆ తర్వాత అతను తన కుటుంబాన్ని హత్య చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేద సినిమా మొదటి పార్ట్ కథ. ఇప్పుడు రెండో పార్టులో ఏం చూపిస్తారో చూడాలి.