God Father First Review: ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు.. కానీ కొత్త సినిమా వచ్చేటప్పుడు రివ్యూ అంటూ కొన్ని ట్వీట్లు చేస్తుంటాడు. తీరా సినిమా వచ్చాక చూస్తే.. చెప్పిందొకటి, అక్కడ ఉన్నది మరొకటి అవుతుంది. దీంతో నానా తిట్లు తిడుతుంటారు అభిమానులు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది అతనెరవో. తనకు తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు. అతని గురించే ఇదంతా. తాజాగా ఆ సందు ‘గాడ్‌ఫాదర్‌’ రివ్యూ ట్వీట్‌ చేశాడు. దీంతో ఫ్యాన్స్‌ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

అదేంటి.. అంతగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే.. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాకు అతనిచ్చిన రేటింగ్‌ రెండున్నర. అవును కేవలం 2.5 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. ‘‘ఇదో యావరేజ్‌ సినిమా. బీ, సీ క్లాస్‌ మాస్‌ జనాల కోసమే ఈ సినిమా. కొత్త సీసాలో పాత సారా. చిరంజీవికి రెస్ట్‌ అవసరం. చిరంజీవికి సాలిడ్‌ స్క్రిప్ట్‌లు అవసరం. ప్రజల నాయకుడు, మాస్‌ హీరో లాంటి పాత్రలు పక్కన పెట్టాలి. చెత్త స్క్రిప్ట్‌లు పక్క పెట్టండి. ఎందుకంటే మీరు మెగాస్టార్‌. కానీ స్క్రిప్ట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ సజెషన్స్ ఇచ్చాడు.

తొలుత సంధు మాటలను ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ నమ్మేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన చెప్పినవి ఏవీ వర్కౌట్‌ అవ్వడం లేదు. ‘‘మొన్న ఇలానే.. ఆదిపురుష్ టీజర్ ముందే చూశానని, అదిరిపోయింది, బ్లాక్‌బస్టర్ అన్నావు, తీరా చూస్తే ఏమైంది. ఫేక్ రివ్యూలు ఆపేయ్ ఇక’’ అంటూ ఏకేస్తున్నారు. ‘మెగాస్టార్‌కి సలహాలు ఇవ్వడానికి ఆ అనుభవం నీకు లేదు.. నువ్వు ఇంకా ఎదగాలి’’ అని మరికొందరు అంటున్నారు. మరి సంధు చెప్పింది ఈసారి నిజమవుతుందా? లేక రివ్యూ తుస్‌ మంటుందా అనేది చూడాలి.

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ తెరకెక్కింది. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలక పాత్రధారులు. అక్టోబరు 5న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిరంజీవి ఈ సినిమాను నిశ్శబ్ద విప్లవం అంటున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus