మెగాస్టార్ చిరంజీవి గత సినిమా ఆచార్యకు భారీ టికెట్ రేట్లు ఒకింత మైనస్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలను చూసిన కొన్ని రోజులకే ఆచార్య రిలీజ్ కావడం కూడా ఆ సినిమాకు ఒకింత మైనస్ అయింది. అయితే ఆచార్య సినిమా విషయంలో జరిగిన తప్పులు గాడ్ ఫాదర్ మూవీ విషయంలో రిపీట్ కాకుండా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన సుదర్శన్ 35ఎం.ఎం బాల్కనీ టికెట్ రేటు గాడ్ ఫాదర్ కు కేవలం 150 రూపాయలుగా ఉండటం గమనార్హం. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మాత్రం ఈ సినిమా టికెట్ రేటు 250 రూపాయలుగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం గాడ్ ఫాదర్ టికెట్ రేట్లు తక్కువగానే ఉండనున్నాయని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ నిర్మాతలు టికెట్ రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని అనుకోవడం లేదు.
దసరా పండుగకు థియేటర్లలో సినిమాలను చూడాలని అనుకునే ప్రేక్షకులకు తక్కువ టికెట్ రేట్లకే సినిమా చూసే అవకాశం లభించడం శుభవార్త అనే చెప్పాలి. ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాల నిర్మాతలు సైతం సాధారణ టికెట్ రేట్లకే ఈ సినిమాలను విడుదల చేయనున్నారు. దసరా పండుగకు రిలీజవుతున్న సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
మరోవైపు ప్రముఖ ఓటీటీలు సైతం పండుగ సమయంలో క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాయి. దసరా పండుగకు ప్రముఖ ఓటీటీలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. దసరాకు థియేటర్లలో రిలీజవుతున్న మూడు సినిమాలలో కలెక్షన్ల విషయంలో గాడ్ ఫాదర్ పైచేయి సాధిస్తుందని చాలామంది భావిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.