సుమంత్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోదావరి’. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది.. అనేది ఈ సినిమా క్యాప్షన్. పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన జి.వి.జి రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2006 వ సంవత్సరం మే 19న ఈ చిత్రం విడుదలయ్యింది. ‘పోకిరి’ వంటి పెద్ద సినిమాల నడుమ విడుదలైన ఈ చిత్రం సైలెంట్ గా హిట్టు కొట్టేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో బాగానే చూసారు.. ఇప్పటికీ బుల్లితెర పై కూడా మిస్ కాకుండా చూస్తున్నారు. ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 15 ఏళ్ళు కావస్తోంది.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
0.92 cr
సీడెడ్
0.72 cr
ఉత్తరాంధ్ర
0.83 cr
ఈస్ట్
0.37 cr
వెస్ట్
0.29 cr
గుంటూరు
0.44 cr
కృష్ణా
0.39 cr
నెల్లూరు
0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
5.21 cr
‘గోదావరి’ చిత్రానికి రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.5.21 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఈ చిత్రం రూ.1 కోట్లు వరకూ లాభాలను మిగిల్చి హిట్ లిస్ట్ లోకి చేరిందని చెప్పొచ్చు.