సినిమాలు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతున్నా, థియేటర్లలో చూస్తేనే ఆ మజా వేరు. 24 కళలకు చెందిన టెక్నీషియన్స్ కొన్ని నెలలు కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. డబ్బులు విషయం పక్కన పెడితే వారు పడిన కష్టమంతా సినిమా విడుదల తొలిరోజు థియేటర్‌లో ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ చూసి పడిన కష్టమంతా మర్చిపోతారు. తెరపై బొమ్మ పడినప్పటి నుండి ప్రేక్షకులు చేసే అల్లరి ఆ సినిమాకి పనిచేసిన వారిని పులకరింపజేస్తుంది.
థియేటర్స్ ముందు బ్యానర్స్, కటౌల్స్‌తో మొదలయ్యి, టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన ప్రేక్షకులు.. అరుపులు, కేకలు, విజిల్స్‌తో థియేటర్‌ను హోరెత్తించడమే కాకుండా, వారు విసిరే పూలు, కాగితాలతో ఓ పండుగ వాతావరణాన్నే సృష్టిస్తారు. సినిమా రిజల్ట్ విషయం పక్కన పెడితే, థియేటర్‌లో సినిమా చూస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. అయితే కరోనా కారణంగా కొన్ని నెలలుగా థియేటర్స్ అని బంద్ అవడంతో, ఓటీటీల్లోనే సినిమా చూస్తున్నారు.
ఇప్పుడు కరోనా కాస్త కంట్రోల్ అవడంతో థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అని సినీ ప్రియులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణలో థియేటర్లు తెరుచుకునేందుకు పర్మిషన్లు ఇచ్చారు. అయితే టాలీవుడ్ పెద్దల నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి బయటకు వచ్చిన టాక్ ఏంటంటే డిసెంబర్‌లో క్రిస్మస్ పండుగకి థియేటర్స్‌లో సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ప్రేక్షకులకు థియేటర్లకు మధ్య చాలా గ్యాప్ రావడంతో ముందుగా జనాలు అలవాటు పడేలా చేసేందుకు, ఏం చేయాలనే దాని పై సినీ ప్రముఖుల చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో క్రిస్మస్‌కి సినిమాను విడుదల చేయాలంటే, కొద్ది రోజులు ముందే థియేటర్స్ ఓపెన్ చేస్తే, ప్రక్షకులు అలవాటు పడతారని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్‌లో ప్రేక్షకులు థియేటర్స్‌కి రావాలంటే, ఓ క్రేజీ మూవీని రిలీజ్ చేయాలని, అప్పుడే పరిస్థితులు ఇంతక ముందులా నార్మల్ అవుతాయని భావిస్తున్నారు. చివరికి సినీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా డిసెంబర్‌లో థియేటర్స్‌లో బొమ్మ పడడం ఖాయమని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!