ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని అక్కడి నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ గత చిత్రాల హక్కులను కొనుగోలు చేసి ఆయా భాషల్లో డబ్బింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలకు బాహుబలి బ్రాండ్ ని జోడిస్తున్నారు. బాహుబలి వచ్చేలా టైటిల్ పెట్టి థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. 2010లో ప్రభాస్, కాజల్ జంటగా నటించిన “డార్లింగ్” సినిమా యువతను బాగా ఆకట్టుకుంది.

ఆ చిత్రాన్ని తమిళంలో డబ్ చేసి “ప్రభాస్ బాహుబలి” అని పేరు పెట్టారు. కథకు, టైటిల్ కి సంబంధం లేకపోయినా .. థియేటర్లకు ప్రభాస్ అభిమానులను రప్పించాలంటే ఈ మాత్రం చేయాల్సిందేనని వారు సమర్ధించుకుంటున్నారు. ప్రచారం కూడా మొదలెట్టారు. తమిళనాడులో జూలై 15న రిలీజ్ కానున్న ప్రభాస్ బాహుబలి (డార్లింగ్) మంచి కలెక్షన్ రాబడుతుందని ఆశిస్తున్నారు. తమ హీరో కోలీ వుడ్, మల్లూవుడ్ లలో కూడా పాగా వేస్తున్నందుకు ప్రభాస్ అభిమానులు ఆనందిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చే సినిమాలకు పక్క రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడుతుందని చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus