Gopichand: గోపీచంద్ కు లైఫ్ ఇచ్చిన సినిమా వెనుక అంత కథ ఉందా?

టి.కృష్ణ గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కు మొదటి సినిమాతోనే చేదు అనుభవం ఎదురైంది. తర్వాత అతను ఖాళీగా ఉన్న టైంలో పిలిచి మరీ ‘జయం’ సినిమాలో విలన్ ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు తేజ. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘నిజం’, ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ చిత్రంలో కూడా విలన్ గా చేశాడు గోపీచంద్.

అయితే అదే టైంలో నిర్మాత పోకిరి బాబురావు గారు ‘యజ్ఞం’ సినిమా కథని తీసుకెళ్లి ప్రభాస్ అండ్ ఫ్యామిలీకి వినిపించారట. ‘కథ బాగుంది కాకపోతే వేరే దర్శకుడు అయితే చేద్దాం అని’ వాళ్ళు సమాధానం ఇచ్చారట. ఆ టైంలో దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తీసిన ఒక్క సినిమా ‘మనసుతో’ కూడా ప్లాప్ అయ్యింది. ఆ దర్శకుడు అంత బరువు గల కథని హ్యాండిల్ చేయలేడేమో అనే ఉద్దేశంతో ‘యజ్ఞం’ కథని పక్కన పెట్టినట్లు ఇటీవల గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అటు తర్వాత అదే కథని కళ్యాణ్ రామ్ కు కూడా వినిపించారట. అక్కడ నుండి కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చినట్టు గోపీచంద్ తెలిపాడు. ఆ టైంలో గోపీచంద్ ను చేయమని అడిగారట. కానీ అప్పుడు ‘వర్షం’ సినిమా షూటింగ్లో ఉండడం వలన.. అలాగే ‘నిజం’ సినిమాకి గుండు చేయించుకోవడం వలన జుట్టు సరిగ్గా రాలేని కారణంగా కొన్నాళ్ళు ఆపి ‘వర్షం’ రిలీజ్ అయ్యాక చేశాడట గోపీచంద్. 2004 లో విడుదలైన ‘యజ్ఞం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

గోపీచంద్ ను హీరోగా నిలబెట్టింది. ఈరోజు గోపీచంద్ హీరోగా నిలబడడం వెనుక ప్రభాస్, కళ్యాణ్ రామ్ లు ఉన్నారని గోపీచంద్ కామెంట్స్ తో స్పష్టమవుతుంది.ఇక గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది.మారుతి ఈ చిత్రానికి దర్శకుడు కాగా బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్ గా నటించింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus