Gopichand: గోపీచంద్‌కి హిట్‌ కావాలి.. ఆయనకూ కావాలి.. ఈసారి వస్తుందా?

Ad not loaded.

కొన్ని కాంబినేషన్లు ఎన్నిసార్లు వచ్చినా బాగా క్లిక్‌ అవుతాయి. అంటే మరీ భారీ వసూళ్లు అందుకోకపోయినా సినిమాల విషయంలో ఆయన అభిమానులు చాలా ఆనందంగా ఉంటారు. అలాంటి కాంబినేషన్‌లో గోపీచంద్‌ (Gopichand) – సంపత్‌ నంది (Sampath Nandi) ఒకటి. ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌లో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు మూడో సినిమా కోసం రెడీ అవుతున్నారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని అంటున్నారు. టాలీవుడ్‌లో గోపీచంద్‌, సంప‌త్‌ నంది హిట్‌ కాంబినేష‌న్‌. ‘గౌత‌మ్‌ నంద‌’ (Goutham Nanda), ‘సీటీమార్‌’ (Seetimaarr) అంటూ రెండు మాస్‌ సినిమాలు చేశారు.

Gopichand

‘గౌత‌మ్‌నంద‌’ సినిమాతో గోపీచంద్‌ను క్లాసీగా చూపించి మెప్పించారు సంపత్‌ నంది. ఇక ‘సీటీమార్‌’ సినిమా పూర్తిగా కమర్షియల్‌ ఫార్మాట్‌ మూవీ. ఈ రెండు సినిమాలకు మించి ఉండేలా మూడో సినిమాకు కథ సిద్ధం చేస్తున్నారట సంపత్‌ నంది. సంప‌త్ నంది ప్రస్తుతం శ‌ర్వానంద్‌తో (Sharwanand) ఓ సినిమా రెడీ చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. ఆ సినిమా త‌ర‌వాతనే గోపీచంద్ సినిమా ప‌ట్టాలెక్కుతుందని అంటున్నారు.

ఓ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడానికి ముందే ఓ దర్శకుడు తర్వాతి సినిమాను ఓకే చేసుకోవడం ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో లేదు. సంపత్‌ నంది ఆ పని చేస్తున్నారట. ఇక శ‌ర్వానంద్‌తో తీస్తున్న సినిమాపై సంప‌త్ నంది ఇప్పుడు పూర్తి ఫోక‌స్‌ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివార్ల‌లో ఓ భారీ సెట్ రూపొందించారట. దాదాపు 70 శాతం షూటింగ్ ఈ సెట్లోనే జ‌రుగుతుందని టీమ్‌ చెబుతోంది.

ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేస్తారు అనే టాక్‌ వినిపిస్తోంది. ఇక గోపీచంద్‌ సంగతి చూస్తే.. ఆయనకు సరైన విజయం ఇప్పుడు అత్యవసరం. మరోవైపు సంపత్‌ నంది నుండి దర్శకుడిగా సినిమా చేసి నాలుగేళ్లు అవుతోంది. ‘సీటీమార్‌’ సినిమానే ఆఖరిది. ఆ తర్వాత సంపత్‌ వరుసగా రచయితగానే కథలు అందిస్తూ వస్తున్నారు.

ముగిసిపోయాయి అనుకున్నవి మళ్లీ స్టార్ట్‌ అయ్యాయిగా.. పాపం టాలీవుడ్‌?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus