Gopichand: రామబాణం దెబ్బ గట్టిగా తగిలిందిగా.. గోపీచంద్ పారితోషికం ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో గోపీచంద్ ఒకరు కాగా గోపీచంద్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన రామబాణం సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ తర్వాత మూవీ శ్రీనువైట్ల డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమా కోసం గోపీచంద్ తన రెమ్యునరేషన్ ను భారీ స్థాయిలో తగ్గించుకున్నారని తెలుస్తోంది. గతంలో 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్న గోపీచంద్ తర్వాత సినిమాకు కేవలం 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. గోపీచంద్ తన పారితోషికంను ఈ స్థాయిలో తగ్గించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. శ్రీనువైట్ల కూడా ఈ సినిమాకు పరిమితంగానే పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

గోపీచంద్ శ్రీనువైట్ల తర్వాత సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. గోపీచంద్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను గోపీచంద్ ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గోపీచంద్ వేగంగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధపడుతున్నారు.

గోపీచంద్ (Gopichand) క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కెరీర్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. శ్రీనువైట్ల కెరీర్ కు ఇది లాస్ట్ ఛాన్స్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ వయస్సుకు అనుగుణంగా పాత్రలను ఎంచుకుంటే కెరీర్ పరంగా ప్రయోజనం చేకూరనుంది

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus