బోయపాటి నెగిటివ్ సెంటిమెంట్ కు చెక్ పడినట్టేనా?

  • January 21, 2023 / 10:04 AM IST

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తెరకెక్కాయి. అయితే బాలయ్య సింహా సినిమాతో సక్సెస్ సాధించినా ఈ సినిమా తర్వాత బాలయ్య నటించిన పరమవీరచక్ర సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో పరమవీరచక్ర సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. సి.కళ్యాణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో లెజెండ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. లెజెండ్ తర్వాత బాలయ్య నటించిన లయన్ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాల ఫలితాల వల్ల బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఏ సినిమా తెరకెక్కినా బాలయ్య తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. మరోవైపు బోయపాటి శ్రీనులా బాలయ్యను హ్యాండిల్ చేయలేరని చాలామంది భావన అనే సంగతి తెలిసిందే.

అయితే గోపీచంద్ మలినేని ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. వీరసింహారెడ్డి మూవీ ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు ఈ వీకెండ్ నాటికి అఖండ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను చెరిపేయడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయనే సంగతి తెలిసిందే.

గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి మూవీ ఫస్టాఫ్ ను నెక్స్ట్ లెవెల్ లో తీశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలలో గోపీచంద్ మలినేని నిజంగా ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేనితో మరో సినిమాలో నటించాలని బాలయ్య కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus