Gopichand Malineni: ఆ హీరోతో గోపీచంద్ మలినేని తర్వాత మూవీ తెరకెక్కనుందా?

  • April 3, 2023 / 01:37 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకరు అనే సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. అయితే తాజాగా గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తానని ప్రకటించారు. రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో రవితేజ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. గోపీచంద్ మలినేని క్రాక్2 సినిమానే మొదలుపెడతారో లేక మరో ప్రాజెక్ట్ ను మొదట మొదలుపెడతారో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. గోపీచంద్ మలినేని రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. చాలామంది నిర్మాతలు గోపీచంద్ మలినేనితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

గోపీచంద్ మలినేని (Gopichand Malineni) క్రాక్ సీక్వెల్ ను కూడా అద్భుతంగా ప్లాన్ చేసి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో క్రాక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా స్క్రిప్ట్, యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. క్రాక్ సినిమా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందనే సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని తర్వాత ప్రాజెక్ట్ లో కూడా శృతి హాసన్ నటించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వరుస విజయాలతో శృతి హాసన్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నా ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus