తనపై వస్తున్న వార్తలను ఖండించిన గోపిచంద్ మలినేని!

ఇతర హీరోలు వరుసగా విజయాలను అందుకుంటూ పోతుంటే మెగా హీరో మాత్రం అపజయాలను మూటగట్టుకుంటున్నారు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్.. ఐలవ్ యూ… ఇలా వరుసగా ప్లాప్ లతో రికార్డు సృష్టించారు. ఈ సారి మాత్రం విజయం అందుకోవాలని తపిస్తున్నారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి తేజు సిద్ధమవుతున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్..  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మళ్ళీ నటించబోతున్నారు. గతంలో ఈ కాంబినేషనలో వచ్చిన విన్నర్ ఆశించినంత విజయం సాధించలేదు. అందుకే ఈసారి మంచి హిట్ ఇవ్వడానికి గోపిచంద్ రెడీ అవుతున్నారు.

ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ గోపిచంద్ తో సినిమాని పక్కన పెట్టారని, కిషోర్ తిరుమల తర్వాత కొత్త దర్శకుడు గోపాల్ తో మూవీ చేయనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. విజయవాడ నేపథ్యంలో జరిగే ఈ కథకు “భగవద్గీత సాక్షిగా..” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక గోపిచంద్ తో తేజు సినిమా లేనట్టే అని కొన్ని వార్త సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీనిపై డైరక్టర్ స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని స్పష్టంచేశారు. సాయి ధరమ్ తేజ్ తో సినిమా తప్పకుండా ఉందని, ఆ వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. మరి ఈసారైనా ఈ కాంబో హిట్ కొడుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus