Mahesh Babu: బాలయ్యతో హిట్టు కొడితే మహేష్ అవకాశం ఇస్తాడా..?

ఈ మధ్యకాలంలో ఒక్క హీరోతో సినిమా హిట్టు కొడితే పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఈజీగానే వస్తుంది. ‘గీత గోవిందం’ లాంటి సినిమా తీసిన పరశురామ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అసలు పరశురామ్-మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అవుతుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ ‘గీత గోవిందం’ సినిమా సక్సెస్ తో పరశురామ్ కి మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.

ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా ఇప్పుడు క్రేజీ సినిమా ఛాన్స్ వచ్చేలా ఉంది. తన కెరీర్ లో ఎన్నో మాస్ సినిమాలు చేశారు గోపీచంద్. కానీ పెద్ద కమర్షియల్ హిట్ అంటే ‘క్రాక్’ సినిమాతో పడింది. రవితేజని ఆన్ స్క్రీన్ పై గోపీచంద్ మలినేని చూపించిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ బాగా పండాయి. ఆ వెంటనే బాలయ్యకి కథ చెప్పి ఒప్పించారు.

ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా చాలా బాగా వస్తుందని.. బాలయ్యకి కచ్చితంగా మరో పెద్ద హిట్ పడుతుందని చెబుతున్నారు. మైత్రి మూవీస్ సంస్థ కూడా ఈ సినిమాని బాగా నమ్ముతుంది. అందుకే బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి పరిమితులు పెట్టుకోవడం లేదు. అంతేకాదు.. గోపీచంద్ కి మరో పెద్ద ఆఫర్ ఇచ్చిందట.

‘ఈ సినిమాతో హిట్టు కొడితే మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఇస్తాం’ అని గోపీచంద్ కి చెబుతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ ఆగితే మహేష్ బాబు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మహేష్ కి కథ నచ్చితే చాలు. మరి గోపీచంద్ మలినేని.. బాలయ్యతో హిట్టు కొట్టి మహేష్ తో ఛాన్స్ పట్టేస్తాడేమో చూడాలి!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus