VeeraSimhaReddy: ‘వీర సింహారెడ్డి’.. థియేటర్లలో మోతే!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. దీనికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో గోపీచంద్ మలినేని ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా నిలిచింది. తన మాటలతో సినిమాపై అంచనాలను పెంచేశారు గోపీచంద్.

షూటింగ్ ఇంకా ఇరవై రోజులు ఉంది కానీ ఇప్పుడు రిలీజ్ చేసినా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. సినిమాలో అంత స్టఫ్ ఉందని చెప్పారు గోపీచంద్. బాలకృష్ణ అభిమానిగా ఈ సినిమా తీశానని.. ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా సినిమా ఉంటుందని అన్నారు. ‘సమరసింహారెడ్డి’ సినిమా ఎలాంటి వైబ్రేషన్స్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్స్ ‘వీరసింహా రెడ్డి’ ఇస్తుందని అన్నారు. అభిమానులు ఊహించిన దానికంటే రెండింతలు ఎక్కువే ఈ సినిమా ఉంటుందని..

బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. సంక్రాంతికి థియేటర్లలో మోత మాములుగా ఉండదని అన్నారు. అభిమానుల్లానే తను కూడా థియేటర్లో సినిమా చూడడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. గోపీచంద్ స్పీచ్ విన్న అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని నమ్ముతున్నారు.

ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య చెల్లెలిగా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. దునియా విజయ్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus