Gopichand: గోపీచంద్ లవ్ ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ఫలితం కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తక్కువ టికెట్ రేట్లతోనే ప్రదర్శితమయ్యే అవకాశం అయితే ఉంది. గోపీచంద్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు.

గోపీచంద్ రష్యాలో చదువుకున్నారనే విషయం ఆయన అభిమానులలో చాలామంది అభిమానులకు తెలుసు. గోపీచంద్ మాట్లాడుతూ చిన్నప్పుడు నాకోసం నాన్న ఒంగోలులో స్కూల్ పెట్టారని నాకు తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న సమయంలో నాన్న చనిపోగా నాన్న చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని వెల్లడించారు. నాన్న లేని లోటు వల్ల మనుషులు ఎలా ఉంటారో తెలియడంతో పాటు నేను మరింత స్ట్రాంగ్ అయ్యానని గోపీచంద్ పేర్కొన్నారు. నేను రష్యాలో ఇంజనీరింగ్ చదివానని బీటెక్ పూర్తయ్యాకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని ఇప్పటివరకు నేను 30 సినిమాల్లో నటించానని తొలివలపు నా తొలి సినిమా అని గోపీచంద్ అన్నారు.

బీటెక్ చదివే సమయంలో ఒక రష్యన్ అమ్మాయి నచ్చిందని ఆమె, నేను ఒకే కాలేజ్ బస్సులో వెళ్లేవాళ్లమని బస్ లో ఆమెను చూస్తూ నేను ప్రయాణం చేసేవాడినని గోపీచంద్ కామెంట్లు చేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అడిగేయాలని అనిపించడంతో అడిగేశానని ఆ అమ్మాయి నేను చెప్పిన మాటలను విని నా దేశం వేరు నీ దేశం వేరు అని తమ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించే ఛాన్స్ లేదని చెప్పిందని గోపీచంద్ పేర్కొన్నారు.

నేను కూడా ఆమె చెప్పిన మాటలు విని సరే అని అన్నానని గోపీచంద్ తెలిపారు. 20 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ ఫెయిల్యూర్ ఘటనను పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ వెల్లడించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus