Gopichand: డైరెక్షన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన గోపీచంద్!

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకుడు కాగా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే గోపీచంద్ మాత్రం డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.

హీరోగా ప్రస్తుతం కెరీర్ ను కొనసాగిస్తున్న గోపీచంద్ భవిష్యత్తులో డైరెక్టర్ అవుతారా? అనే ప్రశ్న ఎదురు కాగా ఈ ప్రశ్నకు సమాధానంగా గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకత్వానికి సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని ఆయన అన్నారు. కానీ ఫుల్ మూవీ చేయాలంటే దర్శకుడిగా చాలా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాల కొరకు చాలా చేయాల్సి ఉంటుందని గోపీచంద్ కామెంట్లు చేశారు. నేను అంత ప్రిపేర్ కాలేదని గోపీచంద్ తెలిపారు. డైరెక్షన్ అనేది నాకు ప్రాక్టికల్ గా రాదని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

రాని విషయాన్ని అనవసరంగా కెలకడం ఎందుకని గోపీచంద్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నటన విషయంలో కొత్తగా ప్రయత్నిస్తానని అంతే తప్ప డైరెక్షన్ జోలికి వెళ్లడం నాకు ఇష్టం లేదని ఆయన కామెంట్లు చేశారు. గోపీచంద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ కు కమర్షియల్ సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.

గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా పక్కా కమర్షియల్ సినిమాను నిర్మించారు. తక్కువ టికెట్ రేట్లకే ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. మారుతి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరనున్నారని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus