Gopichandh: హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్రలు వస్తే నటిస్తా?

తొలివలపు సినిమాతో హీరోగా వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మారుతి దశకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా గోపీచంద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గోపీచంద్ నితిన్ హీరోగా తెరకెక్కిన జయం చిత్రంలో విలన్ గా అందరికీ పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే అందరిని విలన్ గా భయపెట్టిన గోపీచంద్ అనంతరం ప్రభాస్ నటించిన వర్షం, మహేష్ బాబు నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇలా పలు సినిమాలలో విలన్ గా మెప్పించిన గోపీచంద్ అనంతరం హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

ఒకానొక సమయంలో ఈయన కెరియర్ లో వరుస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డారు. చివరిగా ఈయన నటించిన సీటీ మార్ చిత్రం ద్వారా హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే సిటీ మార్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ఆలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా ఈయనకు తిరిగి విలన్ పాత్రలలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు మంచి కథ, దొరికితే విలన్ పాత్రలో నటిస్తానని తెలిపారు.

హీరోకు దీటుగా ఉండే విలన్ పాత్ర వస్తే నటిస్తానని తెలిపారు. ఏదేమైనా మనం మరోసారి గోపీచంద్ ను విలన్ పాత్రలలో చూడబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే పక్కా కమర్షియల్ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus