అందరి సహకారంతోనే ఈ విజయం : రేవంత్
- April 6, 2017 / 07:07 AM ISTByFilmy Focus
ఇండియన్ ఐడల్ టైటిల్ ని గెలుచుకొని తెలుగువారి ప్రతిభని మరోసారి వెలుగెత్తి చాటిన యువగాయకుడు రేవంత్ నిన్న హైదరాబాద్ కి చేరుకున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ‘మనోహరి’.. ‘దమ్ము’లో ‘రూలర్ (మూవీ వెర్షన్)’ సహా పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడి సత్తా చాటిన రేవంత్ ప్రముఖ టీవీ ఛానల్ వారు నిర్వహించే పాటల పోటీలో విజేతగా నిలిచి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ నుంచి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అతను హైదరాబాద్ కి తిరిగిరాగా శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..”అభిమానులు, కుటుంబ సభ్యులు, మీడియాతోపాటు శ్రేయోభిలాషులందరి సహకారంతోనే నేను ఇండియన్ ఐడల్‌ను సొంతం చేసుకోగలిగాను” అని అన్నారు. ఇండియన్ ఐడియల్ వేదికపై తాను ఆలపించిన ఎన్నో పాటలు గొప్ప అనుభూతిని మిగిల్చాయని చెప్పారు. శ్రీకాకుళంలో పుట్టి, పెరిగిన రేవంత్ కి ఇదివరకే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అభిమానులు ఉండేవారు. ఇప్పుడు అతనికి దేశం మొత్తం ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













