బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక. అక్కడ ఏదైనా చెప్తే ప్రపంచం అంతా దానికి చూస్తుంది. అంతేకాదు, తెలుగువాళ్లకి అత్యంత చేరువ అవుతుంది. ముఖ్యంగా శని ఆది వారాలు ఈ రియాలిటీ షోకి రేటింగ్ ఎక్కువ. అందుకే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి విషయాలు ఈవేదికపై చెప్పాలని అనుకున్నారో ఏమో హోస్ట్ నాగార్జున ప్రత్యేకంగా మంత్రి సంతోష్ కుమార్ ని ఆహ్వానించారు. ఇప్పటివరకూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 16కోట్లకి పైగా మొక్కలు నాటారు అని,
గడిచిన మూడు సంవత్సరాలలో ఈ ప్రోగ్రామ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.ఇక నాగార్జున సైతం మొక్కలు నాటితేనే గ్లోబర్ వార్మింగ్ నుంచీ రాబోయే తరాలు తప్పించుకోగలవ్ అని, కనీసం వారానికి ఒక్క మొక్కని నాటమని చెప్పాడు. ఇక ఈ సంవత్సరం మిగిలి ఉన్న వారాల్లో మూడు మొక్కలు నాటమని అభ్యర్ధించారు. సంతోష్ కుమార్ చేస్తున్న ఈ పనికి దేశం అంతా ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు, రెబల్ స్టార్ ప్రభాసం సైతం ముందుకు వచ్చిన కొన్ని వందల ఎకరాల ఫారెస్ట్ ఏరియాని దత్తత తీస్కున్నారు. అలాగే, కింగ్ నాగార్జున కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలో కొంతభాగాన్ని దత్తత తీస్కుని చెట్లని కాపాడతానని మంత్రి సంతోష్ కుమార్ కి చెప్పారు.బిగ్ బాస్ లాంటి వేదికపై ఇలాంటి కార్యక్రమాన్ని ప్రచారం చేస్తే అది ఎక్కువమందికి తెలుస్తుందని, అందరూ కూడా ముందుకు వచ్చి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి అని,
అది ఒక బాధ్యత అంటూ చెప్పారు మంత్రి సంతోష్ కుమార్. అంతేకాదు, ఈ స్టేజ్ పైన ఒక మొక్కని నాగార్జునతో నాటించి దాన్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో సీజన్ వైజ్ గా ఈ మొక్క ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.
[yop_poll id=”7″]
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!