Gunasekhar: ‘చూడాలని ఉంది’ సినిమాలో ఇంట్రెస్టింగ్‌ సీన్‌ వెనుక ఆసక్తికర విషయాలు ఇవీ!

‘చూడాలని ఉంది’.. చిరంజీవి సినిమాల్లో ఇంతటి ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మరొకటి ఉండదు అని చెప్పొచ్చు. ఆ సినిమాలో రైల్వే స్టేషన్‌లో ఓ సీన్‌ ఉంటుంది. ట్రైన్‌ నుండి అంజలా జవేరి, స్టేషన్‌లో చిరంజీవి ఉండి.. ఒకరినొకరు చూసుకుంటారు. మధ్యలో కాసేపు రొమాంటిక్‌ చూపులు, సరదా పనులు ఉంటాయి. కట్‌ చేస్తే ఆమె ట్రైన్‌ దిగి వచ్చేస్తుంది. చిరంజీవితో బైక్‌ ఎక్కి వెళ్లిపోతుంది. వినడానికి, చూడటానికి ఇదెంతవరకు సాధ్యం అనే ప్రశ్న వస్తుంది. అయితే ఆ సీన్‌ చిరంజీవితో ఎలా సాధ్యం అనే ప్రశ్న షూటింగ్‌ టైమ్‌లో వచ్చిందట.

మాటలు లేకుండా, కేవలం చూపులతోనే ఓ సీన్‌ అంటే.. అందులోనూ అది చిరంజీవితో అంటే ఊహించడం కష్టం. అందుకే ఆ సీన్‌ షూటింగ్‌ సమయంలో గుణశేఖర్‌ను (Gunasekhar) టీమ్‌ సభ్యులు పదే పదే అడిగారట. ఇదేదో యువ హీరో పవన్‌ కల్యాణ్‌ కోసం రాసుకున్నట్లు ఉంది అని కూడా అనేవారట. ఈ విషయాన్ని గుణశేఖర్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. ‘శాకుంతలం’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.

ఎలాంటి డైలాగులు లేకుండా పది నిమిషాల సీన్ తీయడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ‘చూడాలని ఉంది’లో ఆ సీన్‌ 18 పేజీలట. అయితే గుణశేఖర్‌ మీద నమ్మకంతో ఆ సీన్‌ను నీకు నచ్చినట్లు తీయు అని చిరంజీవి ఓకే అనేశారట. సీన్‌ పేపర్‌ ఫైనల్‌ చేసి ఇస్తే.. మొత్తం చదివి అదిరిపోయింది మెచ్చుకున్నారట చిరు. అయితే అంతటి వండర్‌ఫుల్‌ సీన్‌ను ఒరిజినల్‌గా జనాల మధ్యలో రైల్వే స్టేషన్‌లో తీస్తే బాగుంటుంది అని అన్నారట చిరు.

దీంతో నాంపల్లి స్టేషన్‌, కాచిగూడ స్టేషన్‌లో ఆ సీన్‌కు ఏర్పాట్లు చేశారట. అయితే తొలుత ఈ విషయం విని నిర్మాత అశ్వనీ దత్‌ షాక్ అయ్యారట. రైల్వే స్టేషన్ సెట్ వేద్దాం.. ఇలా లైవ్‌లో అంటే కష్టం, అసాధ్యం కూడా అన్నారట ఆయన. కానీ గుణశేఖర్‌ పట్టుపట్టడంతో లైవ్‌ లొకేషన్‌ ఓకే చేశారట. అయితే షూటింగ్‌ సమయంలో అశ్వనీదత్ కర్ర పట్టుకుని జనాలను కంట్రోల్ చేయాల్సి వచ్చిందట. ఆ రోజు షూటింగ్ కారణంగా చాలా మంది ట్రైన్ మిస్ అయ్యారట.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus