Gunasekhar: ఆ టైటిల్ పెడతానంటే.. కథ రాయడం ఆపెయ్ అన్నారు : గుణశేఖర్

  • October 8, 2024 / 12:47 PM IST

సీనియర్ స్టార్ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లో ఉండవు. బలమైన ఎమోషన్ల చుట్టూ నడిచే కథల్లా ఉంటాయి. అందుకే ఆయన్ని టాలీవుడ్ మణిరత్నం అనేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే.. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాల టైటిల్స్ చాలా వరకు తెలుగులోనే ఉంటాయి. ‘లాఠీ’ (Laati) నుండి చూసుకుంటే ‘సొగసు చూడతరమా’ ‘చూడాలని వుంది’ (Choodalani Vundi) ‘మనోహరం’ ‘ఒక్కడు’ (Okkadu) ‘వరుడు’ (Varudu) ‘రుద్రమదేవి’ (Rudramadevi) ‘శాకుంతలం’ (Shaakuntalam) ఇలా ఆయన ప్రతి సినిమాకి తెలుగు టైటిలే ఉంటుంది.

Gunasekhar

అయితే మొదటిసారి ‘యుఫోరియా’ అనే ఇంగ్లీష్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు గుణశేఖర్. తాజాగా జరిగిన గ్లింప్స్ లాంచ్ లో ఈ విషయం పై గుణశేఖర్ కి ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీ ప్రతి సినిమాకి తెలుగు టైటిలే ఉంటుంది. ఎందుకు మొదటిసారి ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు?’ అంటూ గుణశేఖర్ ను ప్రశ్నించాడు ఓ రిపోర్టర్.

గుణశేఖర్ మాట్లాడుతూ.. “నా గత సినిమాల సంగతి పక్కన పెడదాం..మీకు నచ్చిందా? అంటే ఆ రిపోర్టర్ ‘షాక్ లో ఉన్నాను’ అన్నాడు. ఈ సినిమా కథ మొదలుపెట్టినప్పుడు ‘ఉద్వేగం’ అని రాశాను. నా టీంకి, వాళ్ళకి అర్ధం కాలేదు.బాబోయ్.. వద్దు ఆపెయ్ కదరాయడం అన్నారు. దీంతో నేను ఏమైంది అంటే? ‘ఉద్వేగం అంటే ఏంటి?’ అన్నారు.

‘భావోద్వేగం.. ఉద్వేగం.. ఒక యుఫోరిక్ వరల్డ్’ అని అన్నాను. అప్పుడు ఆ ‘యుఫోరియా’ పెట్టండి అన్నారు. తెలుగు అర్థంకాని రోజులు ఇవి. నా సినిమా యూత్ ని , పేరెంట్స్ ని టార్గెట్ చేసి తీసింది. ముందు యూత్ కి చేరువయ్యేలా ఉండాలి. అందుకే ‘యుఫోరియా’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం” అంటూ చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోయిన్ సమంత ఆ కామెంట్స్ గురించి స్పందించే ఛాన్స్ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus