Gunasekhar: దేవుడితో పెట్టుకుంటున్నారు.. ‘హిరణ్యకశ్యప’ పై గుణశేఖర్ కామెంట్స్ వైరల్!

దర్శకుడు గుణ శేఖర్ భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో అందమైన సెట్స్ ఉంటాయి. నటీనటుల కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ‘రుద్రమదేవి’, ‘శాకుంతలం’ వంటి హిస్టారికల్ సినిమాలు చేసిన ఈయన… ‘హిరణ్యకశ్యప’ అనే ప్రాజెక్ట్ చేయడం తన డ్రీం అని గతంలోనే చెప్పుకొచ్చాడు. 5 ఏళ్ళు ఆ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. రానా దగ్గుబాటి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా చేయాల్సి ఉంది.

అయితే ‘కామిన్ కాన్ – 2023’ ఈవెంట్‌లో రానా ‘హిరణ్యకశ్యప్’ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తారని చెప్పారు. అక్కడితో ఆగి ఉంటే.. త్రివిక్రమ్ తో డైలాగ్స్, స్క్రీన్ ప్లే చేయించుకుని.. డైరెక్షన్ ఒక్కటి గుణశేఖర్ తో చేయించుకుంటాడు అనుకోవచ్చు. కానీ అక్కడితో ఆగకుండా.. దర్శకుడు ఎవరు అన్నది త్వరలో చెబుతాను అంటూ చెప్పడంతో.. గుణశేఖర్ ను ఈ ప్రాజెక్టు నుండి తప్పించినట్టే..! అందుకే గుణశేఖర్ కూడా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.

ఈ విషయం పై గుణశేఖర్ (Gunasekhar) పరోక్షంగా స్పందించారు. ‘దేవుణ్ణి మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేసుకున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని కూడా గమనిస్తుంటాడని మర్చిపోకూడదు. అనైతిక చర్యలకు పాల్పడితే నైతిక మార్గాల ద్వారానే సమాధానం చెబుతాడు’’ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. దీంతో రానా- త్రివిక్రమ్ లకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు అంతా భావిస్తున్నారు.

‘భీమ్లా నాయక్’ సినిమా టైంలో త్రివిక్రమ్- రానా ఈ ‘హిరణ్యకశ్యప’ గురించి డిస్కస్ చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. త్రివిక్రమ్ కి కూడా మైథాలజీ పై పట్టు ఉంది. అందుకే రానా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus