Kalki: ప్రభాస్‌ ‘కల్కి’ కోసం ఏకంగా గన్నుల ఫ్యాక్టరీ… నాగీ ఏం చేస్తున్నారో చూశారా!

నాగ్‌ అశ్విన్ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి అంటారు. గతంలో ఆయన చేసిన సినిమాలు, ఎంచుకున్న కథలు, రాసుకున్న స్క్రీన్‌ ప్లే, చూపించిన విధానం… ఇలా ఏదీ ఒకేలా ఉండవు. ఆ మాటకొస్తే సగటు మనిషి ఊహించినట్లుగా ఉండవు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇటీవల కాలంలో ఎవరూ టచ్‌ చేయని అంశాలతో, స్టార్‌ నటుల్ని తీసుకొని సినిమా చేస్తున్నారు. అదే ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా గురించి ఓ స్పెషల్ వీడియోను తాజాగా విడుదల చేశారు.

‘కల్కి’ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్‌ వేస్తున్నారు అని మనకు తెలుసు. గతంలోనే ఈ విషయం చెప్పేశారు. అయితే ఈ సినిమాలో వాడే చాలా వస్తువులను ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తున్నారు. ఈ మేరకు గతంలో కొన్ని వీడియోలు రిలీజ్‌ చేసింది టీమ్‌. అయితే ఎందుకో కానీ మధ్యలో ఆ ప్రచారం ఆపేశారు. అయితే ఇప్పుడు ‘సలార్‌’ వచ్చేయడంతో తిరిగి ప్రచారం షురూ చేశారు. అందులో భాగంగా ‘గన్ను’ల వీడయోను రిలీజ్‌ చేశారు.

వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రూ.600 కోట్లకుపైగా బడ్జెట్ అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి’. ఈ సినిమాను తన అల్లుడు నాగీనే తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా… నుండి ఆసక్తికర వీడియో వచ్చింది. పురాణ ఆయుధాలకు టేలెస్ట్ టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమాలో గన్స్‌ వాడుతున్నారని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.

పురాణాలు, సైన్స్‌ను కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలిపారు. పురాణాల్లో ఎన్నో పవర్‌ఫుల్‌ ఆయుధాలు ఉన్నాయని, వాటికి టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు అని టీమ్‌ చెబుతోంది. శ్రీమహా విష్ణువు వాడిన ఆయుధాల్లాంటి వాటికి ఆధునిక హంగులతో మార్పులు చేసి సినిమా కోసం వాడారు. మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మరో మూడు నెలల తర్వాత విడుదల చేస్తారట. అప్పుడే రిలీజ్‌ డేట్ తెలియొచ్చు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus