టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ వంటివి పర్వాలేదు అనిపించాయి. ఇక మొదటి నుండి కూడా ఈ సినిమా గురించి మరో నిర్మాత నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉండటంతో ‘గుంటూరు కారం’ పై అంచనాలు భారీగా పెరిగాయి.
దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
42.00 cr
సీడెడ్
13.50 cr
ఉత్తరాంధ్ర
13.80 cr
ఈస్ట్
8.60 cr
వెస్ట్
6.50 cr
గుంటూరు
7.80 cr
కృష్ణా
6.60 cr
నెల్లూరు
3.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
102.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
8.00 cr
ఓవర్సీస్
20.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
130.40 cr (షేర్)
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకు రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప.. బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది కష్టమనే చెప్పాలి.