Hamida, Akhil: ఇద్దరినీ కలిపిన నాగార్జున..! బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో హమీదాకి ఇంకా అఖిల్ కి రైనింగ్ లైక్స్ టాస్క్ లో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హమీదా కాలు కింద ఉన్న లైక్ బటన్ ని తీశాడు అఖిల్. దీంతో నువ్వు నన్ను టచ్ చేశావ్ అంటూ అఖిల్ తో ఆర్గ్యూ చేసింది హమీదా. కానీ , ఆ తర్వాత ఈ విషయాన్ని ఇద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. కలిసి మాట్లాడుకోలేదు. ఇదే విషయాన్ని వీకండ్ నాగార్జున ఎపిసోడ్ లో తీస్కుని వచ్చాడు. ఇద్దరూ అసలు కలిసి ఎందుకు మాట్లాడుకోలేదు అని చిన్న క్లాస్ పీకారు.

Click Here To Watch NOW

అంతేకాదు, ఇద్దర్నీ పర్సనల్ గా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ హమీదా అఖిల్ తనని కావాలని టచ్ చేయలేదని చాలా నిజాయితీగా చెప్పింది. అదే విషయాన్ని అఖిల్ కూడా చెప్పాడు. ఇక వీరిద్దరి మద్యలో జరిగిన సంఘటనని వీడియో చూపించాడు నాగార్జున. హౌస్ మేట్స్ అభిప్రాయాన్ని కూడా అడిగాడు. కానీ, హౌస్ మేట్స్ అందరూ అఖిల్ తప్పులేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అఖిల్ కూడా నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అంటూ హమీదాకి చెప్పాడు. దీంతో హమీదా అఖిల్ సారీని యాక్సెప్ట్ చేసింది.

లాస్ట్ వీక్ జరిగిన గొడవ వల్ల ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోలేకపోయారు. అందుకే ,నాగార్జున ఇద్దర్నీ కలిపేశారు. అయితే, ఇక్కడే అఖిల్ కి మరికాస్త బలం చేకూరినట్లుగా అయ్యింది. ఇప్పటికే హౌస్ లో అజయ్, స్రవంతి, అషూరెడ్డిల సపోర్ట్ అఖిల్ కి ఉంది. ఇప్పుడు హమీదా కూడా అఖిల్ తో ఫ్రెండ్షిప్ మొదలుపెడితే , మహేష్ విట్టా ఇంకా అరియానా కూడా అఖిల్ వైపే వస్తారు. దీంతో అఖిల్ కి హౌస్ లో మెజారిటీ అనేది ఉంటుంది. మరోవైపు బిందుమాధవి, శివ ఇద్దరూ కూడా వారం వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారుతున్నారు. వీరిద్దరిపై గేమ్ తిరుగుతోంది. అలాగే శివకి సపోర్టింగ్ గా బిందు మాట్లాడుతోంది. అఖిల్ కి , బిందుకి పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది.

అందుకే, ఇప్పుడు అఖిల్ సైన్యం పెంచితే ఇద్దరి మద్యలో ఘర్షణలు వచ్చే అవకాశమే బాగా ఉంటుంది. అందుకే , బిగ్ బాస్ ఈ మాస్టర్ ప్లాన్ వేశాడా అనిపిస్తోంది. ఇక హమీదా ప్రతి టాస్క్ లో చాలా లాజిక్స్ వర్కౌట్ చేస్తుంది. అలాగే, హౌస్ మేట్స్ ఏదైనా అంటే వెంటనే వాళ్లకి సాలిడ్ కౌంటర్స్ ఇస్తుంది. చర్యకి ప్రతిచర్య అనేది అక్కడికక్కడే చూపిస్తుంది హమీదా. తన తప్పులేకపోతే మాత్రం బలంగా వాదిస్తుంది. ఎక్కడా భయపడదు. అలాంటి టైమ్ లో అఖిల్ తో ఇప్పుడు కలిపేసరికి అఖిల్ కి సైన్యం మరింత పెరిగినట్లుగా అయ్యింది. దీంతో శివ, బిందు ఇద్దరినీ టార్గెట్ చేస్తే షో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అందుకే, బిగ్ బాస్ ఈ మాస్టర్ ప్లాన్ వేశాడా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus