బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫొగాట్ హత్యపై కీలకపరిణామ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. మొదట సోనాలి ఫొగాట్ మృతిని సాధారణ మరణమని అందరూ భావించారు. ఆ తరువాత ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారనే వార్తలు బయటకొచ్చాయి. దీంతో ఈ హత్యకు పాల్పడిందెవరో బయటపెట్టాలని జనాల నుంచి డిమాండ్ మొదలయ్యాయి. అలానే ఆమె కూతురి రిక్వెస్ట్ మేరకు సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
ఇదే సమయంలో గోవా ముఖ్యమంత్రి కొన్ని కీలకవ్యాఖ్యలు చేశారు. తమ స్టేట్ పోలీసుల మీద పూర్తిగా నమ్మకం ఉందని.. కానీ ప్రజల నుంచి వస్తోన్న ఒత్తిడి, మృతురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు కేసుని సీబీఐ అప్పగించాలని నిర్ణయించినట్లు.. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లెటర్ రాసినట్లు ఆయన తెలిపారు. సోనాలి ఫొగాట్ హర్యానాకి చెందిన మహిళా.
దీంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. గోవా పోలీసులు చేసిన విచారణపై సోనాలి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీబీఐకి కేసు అప్పగిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే హత్యకు గురైన సోనాలి బీజేపీకి చెందిన నాయకురాలు కాబట్టి.. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విచారణకు సానుకూలత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!