హన్సిక ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం నుండి ఇప్పుడు వరకు చాలా విషయాల్లో వివాదాలమయంగానే సాగింది. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్శీ వస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఆమె పెళ్లి విషయంలోనూ వివాదం కనిపించింది. అయితే ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన హన్సిక.. కెరీర్ ప్రారంభంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు, వచ్చిన రిసెప్షన్ గురించి చెప్పుకొచ్చింది. దుస్తుల విషయంలో ఎదురైన సమస్యలను కూడా ఆమె చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది ఏడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడింది. అందులో ఆమె చర్చించిన, ప్రస్తావించిన అంశాలు వైరల్‌గా మారాయి. అందులో ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డిజైనర్ దుస్తులు కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారని చెప్పుకొచ్చింది. ఎనిమిదేళ్ల వయసులోనే బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హన్సిక.. ‘దేశముదురు’ సినిమాతో దక్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె లుక్స్, క్యూట్‌నెస్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి.
కెరీర్ మొదలుపెట్టిన ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు అని అడిగితే… ‘‘కథానాయికగా ఎంట్రీ ఇచ్చాక దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కొంతమంది డిజైనర్లు దుస్తులు ఇవ్వడానికి అంగీకరించలేదు. సౌత్ నటిననే కారణంతో వాళ్లు అలా చేశారు. ఓ సారి సినిమా రిలీజ్ ఈవెంట్ కోసం దుస్తులు డిజైన్ చేస్తారా? అని అడిగితే ‘నో’ అని ముఖంపై చెప్పేసేవాళ్లు. అలా చెప్పిన చాలామంది ఇప్పుడు డిజైన్ చేస్తానని వస్తున్నారు’’ అని హన్సిక బదులిచ్చారు.
ముందుగా చెప్పినట్లు ప్రస్తుతం (Hansika) హన్సిక చేతిలో ఏడు సినిమాలున్నాయి. ‘పార్టనర్’, ‘105 మినిట్స్’ షూటింగ్ పూర్తి చేసుకోగా… ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘రౌడీ బేబీ’,‘గార్డియన్’, ‘గాంధారీ’, ‘మ్యాన్’ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. వీటి వివరాలు త్వరలో తెలుస్తాయి. అయితే వేటికీ రిలీజ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ తెలుగు సినిమాలు కాగా, మిగిలినవి తమిళ సినిమాలు.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు