Hanu Man First Review: ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబీ రెడ్డి’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత రాబోతున్న చిత్రం ‘హను-మాన్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. గత 5 ఏళ్లలో ఏ చిన్న సినిమాకు కూడా ‘హను-మాన్’ కి వచ్చిన హైప్ వచ్చి ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ‘హను-మాన్’ టీజర్, ట్రైలర్..లు అందరినీ మెస్మరైజ్ చేశాయి. అందులోని విజువల్స్ అందరినీ కట్టి పారేశాయి.

‘ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా?’ అనే క్యూరియాసిటీని కూడా అందరిలోనూ క్రియేట్ చేశాయి. మరోపక్క ‘గుంటూరు కారం’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి పెద్ద సినిమాల పక్కన నలిగిపోతుంది అనే సింపతీ కూడా ‘హను-మాన్’ పై ప్రేక్షకుల్లో ఉంది. ఆ ధైర్యంతోనే ‘హను -మాన్’ మేకర్స్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఆల్రెడీ ‘హనుమాన్’ చిత్రాన్ని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు చూడటం జరిగింది.

సినిమా చూశాక వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ చెప్పడం విశేషంగా చెప్పుకోవాలి. హనుమంతు అనే కుర్రాడు హనుమంతుడు అనుగ్రహంతో పుడితే.. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ‘హనుమాన్’ కథగా తెలుస్తుంది. ‘హనుమాన్’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుందట. అక్కడక్కడా పడినట్టు అనిపించినా..

విజువల్స్ సినిమాని నిలబెట్టాయి అని అంటున్నారు. గెటప్ శీను కామెడీ హైలెట్ గా ఉంటుందట. సత్య, వెన్నెల కిషోర్ కూడా బాగా చేశారని అంటున్నారు. విలన్ వినయ్ రాయ్ రోల్ కూడా అలరిస్తుంది అని అంటున్నారు. ‘ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అని, ‘హనుమంతుడు’ ప్రత్యక్షమైనప్పుడు అందరూ స్టన్ అయిపోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులు తెలీకుండానే చెప్పులు తీసి పక్కన పెట్టి తమ భక్తిని చాటుకుంటారని’ సినిమా  (Hanu Man) చూసిన వాళ్ళు చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus