Hanu Man OTT: ఓటీటీ డేట్‌ కోసం చూస్తుంటే… ‘హనుమాన్‌’ టీమ్‌ ఏం చెప్పిందో చూశారా?

  • March 9, 2024 / 11:11 PM IST

థియేటర్లలో ‘హనుమాన్‌’ (Hanu-Man) సినిమా చూసినోళ్లు, చూడనోళ్లు… ‘హనుమాన్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. వెండితెరపై చూసినోళ్లోమో మరోసారి చూసి ఆ మ్యాజిక్‌ను ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటున్నారు. చూడనోళ్లేమో ఏంటబ్బా ఈ సినిమా స్పెషల్‌, ఇంతటి విజయం సాధించింది అని అనుకుంటున్నారు. అయితే ఇలా వెయిట్‌ చేస్తున్నవాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా వెయిట్‌ చేయిస్తూ వచ్చిన ఓటీటీ టీమ్‌, సినిమా టీమ్‌… ఇప్పుడు భారీ షాక్‌ ఇచ్చాయి. మామూలు భారీ కాదు.. అతి భారీ అని చెప్పొచ్చు.

‘హను – మాన్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నవాళ్లకు జీ5 వరుస వాయిదాలు వేస్తూ చెప్పడం లేదు. మార్చి 8 పక్కా అని అనుకుంటే… ఆ విషయం బయటకు రాకపోగా… థియేటర్‌లో సినిమా రిలీజ్ డేట్‌ సమాచారం బయటకు వచ్చింది. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌లో సినిమా టెలీకాస్ట్‌ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే హిందీలో మాత్రమే ఆ రోజు వస్తుందట. అంతేకాదు జియో సినిమా ఓటీటీలో కూడా సినిమా స్ట్రీమింగ్‌ మొదలవుతుందట.

దీంతో ఈ రోజుల్లో ఓటీటీ కంటే ముందు టీవీల్లో రావడం ఏంటి? అనే ఆశ్చర్యం ప్రేక్షకుల్లో మొదలైంది. మామూలుగా ప్రస్తుత రోజుల్లో సినిమాలు థియేటర్‌ తర్వాత నేరుగా ఓటీటీలోకే సినిమాలు వస్తున్నాయి. అక్కడికి చాలా రోజుల తర్వాతే టీవీలకు వస్తున్నాయి. కానీ ‘హనుమాన్‌’ సినిమా టీమ్‌ మాత్రం షాక్‌ ఇచ్చిన టీవీల్లోకి ముందు వస్తోంది. అందులోనూ హిందీ వెర్షన్‌ను ముందుకు తీసుకొస్తోంది. మరి తెలుగు సినిమా సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ కూడా టీవీనే ముందు వస్తుందా అనేది చూడాలి.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను మాన్‌’ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ పిక్చర్‌ రూ.330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మరి టీవీ, ఓటీటీల్లో ఏ మేరకు రికార్డులు సాధిస్తుందో చూడాలి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus