Teja Sajja: అదే జానర్ ను నమ్ముకున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

ఈ ఏడాది బడ్జెట్, కలెక్షన్ల పరంగా పెద్ద హిట్ ఏదనే ప్రశ్నకు హనుమాన్ (Hanu Man) మూవీ పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమా సాధించిన స్థాయిలో కలెక్షన్లు సాధించడం పెద్ద సినిమాలలో చాలా సినిమాలకు కూడా సాధ్యం కాదని చెప్పవచ్చు. హనుమాన్ సినిమాలో సూపర్ హీరో తరహా పాత్రలో నటించడం తేజ సజ్జాకు (Teja Sajja)  ప్లస్ అయిందని చెప్పవచ్చు. అయితే తేజ సజ్జా తర్వాత మూవీ మిరాయ్ అనే టైటిల్ తో కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారని తేజ సజ్జా రోల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. హనుమాన్ మూవీ తరహా జానర్ నే ఎంచుకున్న తేజ సజ్జా ఈ సినిమాతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈగల్ తో (Eagle) యావరేజ్ రిజల్ట్ అందుకోగా తర్వాత సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

తేజ సజ్జా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. హనుమాన్ సక్సెస్ తో తేజ సజ్జా పారితోషికం కూడా పెరిగిందని తెలుస్తోంది. తేజ సజ్జా సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మరింత అలరించాలనే ఉద్దేశంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తేజ సజ్జా భవిష్యత్తులో టైర్1 హీరోల జాబితాలో చేరడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పాన్ ఇండియాకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటే తేజ సజ్జాకు తిరుగుండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తేజ సజ్జా ఈ జనరేషన్ ప్రేక్షకుల ఆలోచనలకు అనుగుణంగా కథలను ఎంచుకుంటున్నారని సమాచారం అందుతోంది. తేజ సజ్జా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని తన సక్సెస్ రేట్ అంతకంతకూ పెంచుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మిరాయ్ మూవీ మల్టీస్టారర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus