HanuMan: పెద్ద సినిమాలకు పోటీపడి నెగ్గిన చిన్న సినిమా!

అక్టోబర్ 15, 2004. యావత్ తెలుగు ప్రజలందరూ “శంకర్ దాదా ఎంబీబీస్” సినిమా కోసం వేచి చూస్తున్నారు. డి.సి.పి పాటలు అప్పటికీ పెద్ద హిట్. అప్పటికి ట్రైలర్ల హడావుడి లేదు కాబట్టి టీవీలో వచ్చే చిన్న చిన్న ప్రోమోలు హంగామా చేస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే మెగాస్టార్ మంచి హిట్ కొట్టేశాడు. చిరంజీవి కామెడీ టైమింగ్ ని జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఇంకొన్ని థియేటర్లలో “ఆనంద్” అనే చిన్న సినిమా విడుదలైంది.

నిజానికి మొదటి రోజు ఈ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ.. “శంకర్ దాదా” సినిమాకి టికెట్ల దొరక్క.. పక్కనే ఖాళీగా ఉంది కదా అని “ఆనంద్” సినిమా చూసినవాళ్ళందరూ “సినిమా భలే ఉంది” అని టాక్ స్ప్రెడ్ చేయడంతో.. శంకర్ దాదా సునామీ నుంచి ఆనంద్ తేరుకొని నిలబడగలగడమే కాక సూపర్ హిట్ గా నిలిచింది. “శంకర్ దాదా సినిమా ఓవర్ ఫ్లోస్ వచ్చినా మా సినిమా ఆడేస్తది అనే నమ్మకంతోనే విడుదల చేశామని” దర్శకుడు శేఖర్ కమ్ముల అప్పటి సక్సెస్ మీట్ లో బాహాటంగా ఒప్పుకోవడం విశేషం.

ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇంచుమించుగా అలాంటి పోటీనే తెరపైకొచ్చింది. వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబుల బడా సినిమాలతోపాటు.. తేజ సజ్జా నటించిన చిన్న సినిమా కూడా విడుదలవుతోంది. అన్నీ సినిమాలపై మంచి అంచనాలున్నా.. ఈ పండగ హడావుడిలో (HanuMan) “హనుమాన్”ను పట్టించుకొనేవారు కాస్త తక్కువ అని చెప్పాలి. అయితే.. “ఆనంద్” తరహాలో “హనుమాన్” కూడా మంచి టాక్ తెచ్చుకొంటే మాత్రం కచ్చితంగా సూపర్ హిట్ గా నిలుస్తుంది. మరి.. ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus