Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » వెండితెర మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ

వెండితెర మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ

  • May 31, 2016 / 06:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెండితెర మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ

సంచలనం ఆయన ఇంటి పేరు. సాహసం ఆయన వంటిపేరు. తెలుగు చలన చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం సువర్ణాక్షరాలతో రాయదగినది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా.. అడుగు పెట్టిన ప్రతి రంగంలో ఖ్యాతిని ఆర్జించారు. ఎందరికో ఆదర్శ ప్రాయుడయ్యారు. నేడు కృష్ణ 73వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికి ఆయన 345 సినిమాలలో నటించారు. 50 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం ఆయనిది. సినిమానే శ్వాసగా బతికే ఆయన గురించి మీకు తెలియని ఆసక్తికర సంగతులు ..

తొలి అడ్వాన్స్ రూ.500Krishna, Krishna Moviesఘట్టమనేని శివరామకృష్ణ. 31 మే1943న ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మలకు జన్మించారు. స్వస్థలం బుర్రిపాలెం. కృష్ణ తేనెమనసులు సినిమా 31.03.1965 న విడుదల అయ్యింది. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు కృష్ణ కి పెళ్లి అయి బాబు కూడా ఉన్నాడు. వారిని ఇంటి వద్దనే వదిలి చెన్నై వెళ్ళారు. ఈ సినిమాకు అడ్వాన్స్ గా రూ.500 తీసుకున్నారు.

ట్రెండ్ సెట్టర్Krishna, Krishna Moviesకృష్ణ వందో చిత్రం అల్లూరి సీతారామ రాజు. ఇది తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం. ఈ చిత్రంలోని తెలుగు వీరా లేవరా పాటకు తొలిసారిగా జాతీయ అవార్డ్ వచ్చింది. కృష్ణ 200 వ చిత్రం ఈనాడు. 300వ చిత్రం తెలుగువీర లేవరా. 345 చిత్రం శ్రీ శ్రీ. రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి తెలుగు 70 ఎం ఎం చిత్రం సింహాసనం. ఇలా అనేక రికార్డులు కృష్ణ సృష్టించారు.

హార్డ్ వర్కర్Krishna, Krishna Moviesకృష్ణ తొలి పదేళ్లలో రోజుకు మూడు షిప్టు లు పని చేశారు. ఉదయం 7 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి అర్ధ రాత్రి 2 గంటల వరకు పని చేసారు. ఇలా కష్టపడ్డారు కాబట్టే 345 చిత్రాల్లో నటించగలిగారు. ఏ హీరో ఇన్ని చిత్రాల్లో నటించలేదు.

విదేశాల్లో విజయంKrishna, Krishna Moviesమోసగాళ్లకు మోసగాడు ఆంగ్ల చిత్రం మెకన్నాస్ గోల్డ్ చిత్రం స్ఫూర్తితో తీసారు. అయినా కృష్ణ నటన కోసం ఆంగ్లేయులు ఈ సినిమాను చూసారు. ఈ సినిమాను ది ట్రెజర్ పేరుతో డబ్ చేసి విదేశాల్లో విడుదల చేస్తే హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని గ్రీకు భాషలో కూడా అనువదించారు. అక్కడ కూడా ఈ చిత్రం కాసులను కురిపించింది.

నచ్చిన హీరో ..Krishna, Krishna Moviesకృష్ణకి నేటి హీరోల్లో బెస్ట్ హీరో మహేష్. ఆయన కాకుండా ఇంకెవరు నచ్చుతారని కృష్ణను అడిగితే నాగార్జున బాగా నచ్చుతాడని చెప్పారు. “నాకు నాగార్జునను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి సినిమాలు చేస్తాడు. ప్రేమ, యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తాడు. ఒక భక్తి రస ప్రధాన చిత్రం చేస్తాడు. ఆ వెంటనే దానికి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తాడు. తను దేన్నయినా చేయగలడు. తండ్రి పేరు నిలబెడుతున్నాడు.” అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

లెక్కలేనన్నీ విరాళాలుKrishna, Krishna Moviesజై ఆంధ్ర ఉద్యమంలో మరణించిన అమర వీరుల కుటుంబాలకు “మంచి వాళ్లకు మంచివాడు” చిత్రం విడుదలైన మొదటి రోజు వసూళ్లను కృష్ణ అందజేశారు. అల్లూరీ సీతారామరాజు విడుదల సందర్భంగా సీతారామరాజు సోదరునికి పది వేల రూపాయలు అందించారు. 1983 తుపాన్ భాదితులకు లక్ష రూపాయలు అందించారు. 1985 ఉభయ గోదావరి వరద భాదితులకు రూ .4 లక్షలు ఇచ్చారు. ఆపదలో ఉన్నవారికి కృష్ణ లేదనకుండా ఆదుకున్నారు. సినిమా నిర్మాతలు ఇచ్చిన చెక్కులు చెల్లక పోయిన వారిని అడగ లేదు. తన యాభై ఏళ్ళ కెరీర్ లో పారితోషికం విషయంలో డిమాండ్ చేసిన సందర్భం ఒకటి కూడా లేదంటే అతిసయోక్తి కాదు.

మనవడితో కలిసి ..Krishna, Krishna Moviesకృష్ణకు ఓ కోరిక ఉంది. తన కొడుకు మహేష్, మనవడు గౌతమ్ కలిసి ఒక భారీ చిత్రంలో నటించాలని ఉందని కృష్ణ చెప్పారు. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సూటయ్యే కథ ఉంటే తాము నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు మహేష్ కూడా ప్రకటించారు. ఈ ఏడాదిలో సూపర్ కథతో కొడుకు, మనవడు తో కలిసి కృష్ణ నటించాలని, తెలుగు చిత్ర పరిశ్రమ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగ రాయాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Goutham krishna
  • #Krishna
  • #Krishna Ghattamaneni
  • #Krishna Movies
  • #Mahesh Babu

Also Read

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

trending news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

13 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

14 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

15 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

16 hours ago

latest news

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

15 hours ago
Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

19 hours ago
Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

20 hours ago
Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version