నటాషాతో హార్దిక్ ఎంగేజ్మెంట్.. పేరెంట్స్ కి తెలియదా..?

  • January 4, 2020 / 07:20 PM IST

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ నటాషాను ప్రేమించిన హార్దిక్… తాజాగా ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య హార్దిక్, నటాషాలు తమ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ‘నువ్వు నా సొంతం.. నేను నీ సొంతం.. ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలుసు’ అనే క్యాప్షన్ తో తన ఎంగేజ్మెంట్ విషయాన్ని హార్దిక్ రివీల్ చేశాడు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యువ జంటకు ధోని, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయం ఫ్యాన్స్ తో పాటు పాండ్యా తల్లితండ్రులను సైతం ఆశ్చర్యపరిచింది.

దీనిపై పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా పలు ఆసక్తికరమైన విషాయాలను మీడియాతో పంచుకున్నారు. పాండ్యా, నటాషా నిశ్చితార్థం చేసుకుంటారననే విషయం తమకి తెలీదని.. నిశ్చితార్థం అయిన తరువాతే విషయం తెలిసిందని అన్నారు. అయితే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తమకి ముందే తెలుసునని.. న్యూఇయర్ సందర్భంగా దుబాయ్ వెళ్తున్నారనే విషయం కూడా తెలుసనీ అన్నారు. నటాషా చాలా మంచి అమ్మాయని, వాళ్ల కుటుంబసభ్యులతో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పారు. వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలో నిర్ణయించలేదని.. త్వరలోనే మంచి ముహూర్తం పెడతామని అన్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus