పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండటం ఫ్యాన్స్ ను ఒకింత నిరాశకు గురి చేస్తోంది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా సినిమా అయిన హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేదు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ గ్లింప్స్ చాలా స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే మరో గ్లింప్స్ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అంతాఇంతా కాదు. వచ్చే ఏడాది పవన్ నటిస్తున్న రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ సక్సెస్ దక్కుతుందో చూడాల్సి ఉంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తుండగా ఈ బ్యూటీ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యే వరకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని నిధి అగర్వాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో పవన్ ప్రాజెక్ట్ లు తెరకెక్కుతుండగా యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లకు పవన్ ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. ఈ డైరెక్టర్లు పవన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. పవన్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!